సెక్టోరల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ABN , Publish Date - Oct 01 , 2026 | 01:38 AM
సమగ్ర శిక్ష ప్రాజెక్టు కార్యాలయంలో సుదీర్ఘంగా ఖాళీగా ఉన్న సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ అధికారుల పోస్టుల భర్తీకి ఎట్టకేలకు బుధవారం నోటిఫి కేషన్ జారీ అయింది. రెండు సెక్టోరల్ ఏఎంవో, ఏఎల్‌ఎస్ కోఆర్డినేటర్, మూడు అసిస్టెంట్ సెక్టోరల్ పోస్టులు, రెండు ఏఎస్‌వో, ఒక ఎంపీవో పోస్టుకు సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డి.అనిల్‌కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
5 లోపు దరఖాస్తులకు ఆహ్వానం
ఒంగోలు విద్య, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : సమగ్ర శిక్ష ప్రాజెక్టు కార్యాలయంలో సుదీర్ఘంగా ఖాళీగా ఉన్న సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ అధికారుల పోస్టుల భర్తీకి ఎట్టకేలకు బుధవారం నోటిఫి కేషన్ జారీ అయింది. రెండు సెక్టోరల్ ఏఎంవో, ఏఎల్‌ఎస్ కోఆర్డినేటర్, మూడు అసిస్టెంట్ సెక్టోరల్ పోస్టులు, రెండు ఏఎస్‌వో, ఒక ఎంపీవో పోస్టుకు సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డి.అనిల్‌కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు ప్రభుత్వ, జడ్పీ, మునిసిపల్ స్కూళ్లలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు అర్హులు. స్కూలు అసిస్టెంట్‌గా ఐదు సంవత్సరాలు, సెకండరీ గ్రేడ్ టీచర్లుగా ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు మాత్ర మే అక్టోబరు 5వతేదీ సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తులను సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ప్రతిదానికి వేర్వేరుగా చేయాలి. ఈ పోస్టుల్లో ఫారిన్ సర్వీసుపై పనిచేసేందుకు దరఖా స్తును సంబంధిత అధికారుల ధ్రువీకరణతో పాటు అవసరమైన పత్రాలు, సర్వీసు రిజిస్టర్ తో సమర్పించాలి. ఈ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ విద్యార్హతలు తప్పనిసరి.