Share News

రెవెన్యూ శాఖకు నోటీసులు

ABN , Publish Date - May 02 , 2026 | 03:12 AM

చాకలికుంటలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై మైనింగ్‌ అధికారులలో కదలిక వచ్చింది. శుక్రవారం ‘చాకలికుంట గుల్ల’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కఽథనంతో మైనింగ్‌ శాఖ ఆర్‌ఐ రాజానాయుడు కొంతమంది సిబ్బందితో కలిసి అక్రమంగా తవ్వకాలు చేసిన కొప్పోలులోని చాకలికుంటను పరిశీలించారు.

రెవెన్యూ శాఖకు నోటీసులు
చాకలికుంటలో కొలతలు వేస్తున్న మైనింగ్‌ అధికారులు

చాకలికుంటలో అక్రమ తవ్వకాలపై కదిలిన మైనింగ్‌ అధికారులు

రెండు వేల క్యూబిక్‌ మీటర్లు తవ్వినట్లు గుర్తింపు

ఒంగోలు క్రైం, మే 1 (ఆంధ్రజ్యోతి) : చాకలికుంటలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై మైనింగ్‌ అధికారులలో కదలిక వచ్చింది. శుక్రవారం ‘చాకలికుంట గుల్ల’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కఽథనంతో మైనింగ్‌ శాఖ ఆర్‌ఐ రాజానాయుడు కొంతమంది సిబ్బందితో కలిసి అక్రమంగా తవ్వకాలు చేసిన కొప్పోలులోని చాకలికుంటను పరిశీలించారు. అప్పటికే అక్కడ తవ్వకాలను నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతంలో కొలతలు వేసి అక్కడ నుంచి సుమారు 2వేల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ తరలించినట్లు గుర్తించారు. గ్రావెల్‌ అక్రమంగా ఎవరు తవ్వారు అనేది తేల్చాలని మండల తహసీల్దారుకు నోటీసులు జారీచేసినట్లు మైనింగ్‌శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు. ఒంగోలు కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న కుంటలో అక్రమ తవ్వకాలు గత 20రోజులుగా జరుగుతుంటే స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికా రులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వసున్నాయి.

Updated Date - May 02 , 2026 | 03:12 AM