కోలాహలంగా నామినేషన్లు
ABN , Publish Date - Nov 17 , 2026 | 02:41 AM
కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబం ధించి చివరి రోజు నామినేషన్ల కార్యక్రమం కోలాహలంగా సాగింది. చైర్మన్ పదవి కోసం సోమవారం 10 మంది అభ్యర్థులు 14 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
కందుకూరు మున్సిపల్ చైర్మన్ పదవికి 13 మంది 17 దాఖలు
వార్డు కౌన్సిలర్లకు 208
కందుకూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబం ధించి చివరి రోజు నామినేషన్ల కార్యక్రమం కోలాహలంగా సాగింది. చైర్మన్ పదవి కోసం సోమవారం 10 మంది అభ్యర్థులు 14 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో శని, ఆదివారాలలో దాఖలైన నామినేషన్లతో కలిపి చైర్మన్ స్థానం కోసం 13 మంది మొత్తం 17 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. వార్డు కౌన్సిలర్లుగా వివిధ పార్టీలు, ఇండిపెండెంట్లతో కలిపి సోమవారం 139 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో శనివారం దాఖలైన 5, ఆదివారం వచ్చిన 64 నామినేషన్లతో కలిపి వార్డు కౌన్సిలర్ పదవి కోసం మొత్తం 208 నామినేషన్లు అధికారులకు అందాయి. వీరిలో 79 మంది టీడీపీ నుంచి, 96 మంది వైసీపీ నుంచి, బీజేపీ నుంచి 5, జనసేన 6, సీపీఎం 2, సీపీఐ 4, ఇండిపెండెంట్లు 16 మంది ఉన్నారు.
చైర్మన్ అభ్యర్థులు వీరే
టీడీపీ : పిడికిటి వెంకటేశ్వర్లు (రెండు సెట్లు), దివి సౌభాగ్యలక్ష్మి, పిడికిటి లావణ్య (రెండు సెట్లు)
వైసీపీ : పువ్వాడి వెంకటరమణయ్య (రెండు సెట్లు), షేక్ రఫి, వల్లూరి కోటేశ్వరరావు, వల్లూరి వసంతలక్ష్మి, పెయ్యల రమేష్ యాదవ్, నగళ్ల నారయ్య
బీసీవై : షేక్ సుల్తాన్
కాంగ్రెస్ : సయ్యద్ గౌస్‌మొహిద్దీన్ (రెండు సెట్లు)
బీఎస్పీ : గేరా మాధవి
ఎస్‌డీపీవై : సయ్యద్ నసీమా