Share News

నామమాత్రంగానే కొనుగోళ్లు

ABN , Publish Date - May 21 , 2026 | 03:31 AM

దక్షిణాది పొగాకు మార్కెట్‌ మొక్కుబడిగా సాగుతోంది. రోజువారీ వేలానికి వస్తున్న బేళ్ల సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది. వాటిలోనూ సగం మించి కొనుగోలు చేయడం లేదు.

నామమాత్రంగానే కొనుగోళ్లు

పది కేంద్రాలకు తెచ్చింది 1,851 బేళ్లు

వాటిలో కొన్నది 1,129 మాత్రమే

ఎస్‌బీఎస్‌లో సగానికిపైగా తిరస్కరణ

ఒంగోలు మే 20 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్‌ మొక్కుబడిగా సాగుతోంది. రోజువారీ వేలానికి వస్తున్న బేళ్ల సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది. వాటిలోనూ సగం మించి కొనుగోలు చేయడం లేదు. బుధవారం ఈ ప్రాంతంలో వేలం తీరును పరిశీలిస్తే పొగాకు మార్కెట్‌ ఎంత దారు ణంగా సాగుతుందో అర్ధమవుతుంది. దక్షిణాదిలోని రెండు రీజియన్‌ల పరిధిలో 11 వేలం కేంద్రాలు ఉండగా టంగుటూరులో ప్రస్తుతం ఇతర కారణాలతో ఆగి ఉంది. మిగిలిన పది వేలం కేంద్రాలకు బుధ వారం వేలానికి కేవలం 1,851 బేళ్లను తెచ్చారు. సాధారణంగా ఈ సమయంలో రోజువారీ కనీసం ఎడెనిమిది వేల బేళ్లను తీసుకువస్తుంటారు. అలాం టిది అందులో నాల్గో వంతు బేళ్లు కూడా బుధవారం లేవు. వారం రోజులుగా రెండున్నర నుంచి మూడున్నర వేలు వస్తుండగా బుధవారం ఆ సంఖ్య బుధవారం మరింత తగ్గింది. మొత్తం 1,851 బేళ్లను తీసుకురాగా అందులో 1,129 మాత్రమే కొనుగోలు చేశారు. మిగిలిన 722 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. వాటిలో 601 బేళ్లను అధికారులు సూచించిన ధరకు కొనేందుకు బయ్యర్లు ముందుకు రాకపోవడంతో నోబిడ్‌ చేశారు. మరో 64 బేళ్లను తొలుత బయ్యర్లు కొనుగోలు చేసి అనంతరం పలురకాల కారణాలు చూపుతూ తిరస్కరించారు. ఎస్‌బీఎస్‌ రీజియన్‌లో బుధవారం కూడా సగానికిపైగా ఇలా తిరస్కరణలు జరిగాయి. అందులో వెల్లంపల్లిలో 59శాతం తిరస్కరణలు జరిగాయి. కొండపిలో 54శాతం తిరస్కరించారు.

Updated Date - May 21 , 2026 | 03:31 AM