స్వల్పంగా తగ్గిన నోబిడ్‌లు
ABN , Publish Date - Aug 05 , 2026 | 02:59 AM
దక్షిణాది పొగాకు మార్కె ట్లో మంగళవారం నోబిడ్‌లు కాస్తంత తగ్గాయి. అదేసమయంలో రోజువారీ కొనుగోలు పరిమాణంతోపాటు సగటు ధర స్వల్పంగా పెరిగింది. ఈ ప్రాంతంలోని వేలం కేంద్రాలలో సోమవారం 0.51 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు జరగ్గా సగటున కిలోకు రూ.187 ధర లభించింది.
సగటు ధర, కొనుగోలు పరిమాణం పెరుగుదల
వెల్లంపల్లి కేంద్రంలో వేలానికి బ్రేక్
ఒంగోలు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కె ట్లో మంగళవారం నోబిడ్‌లు కాస్తంత తగ్గాయి. అదేసమయంలో రోజువారీ కొనుగోలు పరిమాణంతోపాటు సగటు ధర స్వల్పంగా పెరిగింది. ఈ ప్రాంతంలోని వేలం కేంద్రాలలో సోమవారం 0.51 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు జరగ్గా సగటున కిలోకు రూ.187 ధర లభించింది. సుమారు 32శాతం బేళ్లు నోబిడ్ అయ్యా యి. మంగళవారం దాదాపు 0.61 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు జరగ్గా సగటు ధర కిలోకు రూ.88.79 లభించింది. నోబిడ్ బేళ్లు 26.85 శాతానికి తగ్గాయి. ప్రత్యేకించి ఎస్‌బీఎస్ రీజియన్‌లో సగటు ధర కిలోకు రూ.195.40 లభించింది. నోబిడ్‌లు కూడా సోమవారం కన్నా పదిశాతం మేర తగ్గాయి. అయితే ఈ రీజియన్‌లోని వెల్లంపల్లి కేంద్రంలో ధరలు సరిలేవం టూ రైతులు నిరసనకు దిగి వేలాన్ని నిలిపేశారు. ఎస్‌బీఎస్ రీజియన్‌లోని ఐదు కేంద్రాల్లో 3,559 బేళ్లకు వేలం జరగ్గా 2,362 కొనుగోలు చేశారు. సగటు ధర కిలోకు రూ.195.40 లభించింది. 27.65 శాతంతో 984 బేళ్లు నోబిడ్ అయ్యాయి. వెల్లంపల్లిలో 184 బేళ్ల వేలం పూర్తయ్యే సరికి 45.65 శాతంతో 84 నోబిడ్ అయ్యాయి. దీంతో అక్కడి రైతులు వేలాన్ని ఆపేశారు. ఒంగోలు-1లో 38.89శాతం, వెల్లంపల్లి-2 కేంద్రంలో 31.33శాతం నోబిడ్‌లు ఉన్నాయి. ఇక ఎస్‌ఎల్‌ఎస్ రీజియన్‌లోని ఆరు కేంద్రాల్లో 3,310 బేళ్లకు వేలం నిర్వహించగా 2,252 కొనుగోలు జరిగాయి. సగటున కిలోకు రూ.182.17 ధర లభించింది. మొత్తం 26.04 శాతం బేళ్లు నోబిడ్ కాగా కనిగిరిలో 33.43శాతం, డీసీపల్లిలో 34.88శాతం, కందుకూరు-1లో 30.50శాతం నోబిడ్ అయ్యాయి. కందుకూరులోని రెండు కేంద్రాల్లో సోమవారం వేలం నిలిచిపోగా అధికారుల చొరవతో మంగళవారం కొనసాగింది.