Share News

స్వల్పంగా తగ్గిన నోబిడ్‌లు

ABN , Publish Date - Jul 12 , 2026 | 02:07 AM

దక్షిణాది పొగాకు మార్కెట్లో శనివారం నోబిడ్‌ బేళ్లు స్వల్పంగా తగ్గాయి. ఈవారంలో 6వతేదీ నుంచి వరుసగా ఐదు రోజులు సగటున 31నుంచి 37శాతం వరకు నోబిడ్‌లు ఉంటుండగా శనివారం 24.53 శాతానికి పరిమితమ య్యాయి.

స్వల్పంగా తగ్గిన నోబిడ్‌లు

సగటున 24.53శాతానికి తగ్గుదల

కొన్ని కేంద్రాల్లో ఆందోళనకరంగానే..

ఒంగోలు, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్లో శనివారం నోబిడ్‌ బేళ్లు స్వల్పంగా తగ్గాయి. ఈవారంలో 6వతేదీ నుంచి వరుసగా ఐదు రోజులు సగటున 31నుంచి 37శాతం వరకు నోబిడ్‌లు ఉంటుండగా శనివారం 24.53 శాతానికి పరిమితమ య్యాయి. ప్రత్యేకించి కందుకూరులోని రెండు, కొండపి, ఒంగోలు-1 కేంద్రాలలో వాటి శాతం తగ్గాయి. అదేసమయంలో కొన్ని కేంద్రాల్లో నోబిడ్లు అధికంగానే ఉండటం ఒకింత ఆందోళనకరమైన విషయమే. దక్షిణాదిలోని 11వేలం కేంద్రాలకు శనివారం 4,891 బేళ్లను అమ్మకానికి తీసుకురాగా 3,278 కొనుగోలు చేశారు. అలా 1,613 బేళ్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. వాటిలో 205 అధికారులు సూచించిన ధరలకు బయ్యర్లు కొనుగోలు చేయక నోబిడ్‌ అయ్యాయి. అంటే వేలంకు తెచ్చిన బేళ్లలో సుమారు 24.53శాతం నోబిడ్‌లు అయ్యాయి. అందులో అత్యధికంగా కనిగిరి వేలం కేంద్రంలో 55.97శాతం ఉన్నాయి. వెల్లంపల్లిలో 44.79శాతం, ఒంగోలు-2లో 43.71శాతం నోబిడ్‌లు కావడం రైతుల్లో ఆందోళన నెలకొంది. వారం నుంచి నోబిడ్‌లు ఎక్కువగానే ఉంటున్న ఒంగోలు-1, కొండపి. కందుకూరులోని రెండు కేంద్రాల్లో శనివారం నోబిడ్‌లు 12 నుంచి 20శాతంలోపుగానే ఉండటం కొంత ఊరట కలిగించే అంశం. మూడు రోజుల క్రితం సీఎం నిర్వహించిన సమీక్ష సందర్భంగా సగటున ధర కిలో రూ.200 తగ్గకుండా, నోబిడ్‌లు లేకుండా మార్కెట్‌ సాగాలని అదేశించిన విషయం విదితమే. తదనుగుణంగా ఈ మూడు రోజులు మార్కెట్లో పెద్దగా మార్పు కనిపించలేదు. సోమవారం నుంచి అయినా కొంతమేర మార్పు ఉండవచ్చని అటు బోర్డు అధికారులు, ఇటు రైతు ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. అలా వ్యాపారులలో మార్పు వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Updated Date - Jul 12 , 2026 | 02:07 AM