నాల్గో వంతు నోబిడ్
ABN , Publish Date - Nov 15 , 2026 | 02:35 AM
దక్షిణాది పొగాకు మార్కెట్లో మళ్లీ నోబిడ్‌లు పెరుగుతున్నాయి. వారం, పది రోజులుగా సగటున 20శాతం వరకు నోబిడ్‌లు ఉం టుండగా శనివారం మరింత పెరిగాయి. అమ్మకానికి తెచ్చిన బేళ్లలో నాల్గో వంతు నోబిడ్ అయ్యాయి. అధిక వేలం కేంద్రాల లో 25శాతం కన్నా ఎక్కువ నోబిడ్‌లు ఉన్నాయి.
పొగాకు మార్కెట్లో మళ్లీ భారీగా తిరస్కరణలు
కనిగిరిలో 51.83 శాతం, పొదిలిలో 41.86శాతం
అంతంతమాత్రంగానే ధరలు... మెరుగవని రోజువారీ కొనుగోళ్లు
ఒంగోలు నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్లో మళ్లీ నోబిడ్‌లు పెరుగుతున్నాయి. వారం, పది రోజులుగా సగటున 20శాతం వరకు నోబిడ్‌లు ఉం టుండగా శనివారం మరింత పెరిగాయి. అమ్మకానికి తెచ్చిన బేళ్లలో నాల్గో వంతు నోబిడ్ అయ్యాయి. అధిక వేలం కేంద్రాల లో 25శాతం కన్నా ఎక్కువ నోబిడ్‌లు ఉన్నాయి. కనిగిరిలో తెచ్చిన బేళ్లలో ఏకంగా సగానికిపైగా, పొదిలిలో 40శాతా నికిపైగా తిరస్కరణకు గురయ్యాయి. మరోవైపు ధరల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. రోజువారీ కొనుగోళ్లు సైతం ఏమాత్రం మెరుగుపడలేదు. దక్షిణా దిలో 11 వేలం కేంద్రాలు ఉండగా శనివారం పది కేంద్రాల్లో వేలం జరిగింది. సాధారణంగా ఒక్కో కేంద్రంలో వెయ్యి వంతున పది వేల బేళ్లు వేలానికి తీసుకురావాలి. అయితే ధరలు సరిలేక, నోబిడ్‌లు పెరుగుతుండటంతో అధికా రులు కూడా బేళ్లను తగ్గిస్తున్నారు. అలా శనివారం పది కేంద్రాల్లో కలిపి 4,678 బేళ్లను మాత్రమే అమ్మకానికి తీసుకురాగా వాటిలో 3,140 బేళ్లను మాత్రమే వ్యాపారులు కొను గోలు చేశారు. సగటున కిలోకు రూ.153.10 ధర లభించింది. గరిష్ఠ, కనిష్ఠ ధరలు కూడా తగ్గుతున్నాయి. గతంలో గరిష్ఠ ధర కిలో రూ.250, కనిష్ఠ ధర కిలో రూ.110 ఉంటు న్నాయి. అవి క్రమంగా తగ్గుతూ శనివారం కిలో రూ.234, రూ.90కి చేరాయి. ఆ ప్రభా వం సగటు ధరలపై పడి తగ్గిపోతోంది.
తిరస్కరణలలో నోబిడ్‌లే ఎక్కువ
మార్కెట్లో శనివారం వివిధ కారణాలతో 1,538 బేళ్లు తిరస్కరణలు జరగ్గా అందులో 1,168 అధికారులు సూచించిన ధరలకు బయ్యర్లు కొనుగోలు చేయక నోబిడ్ అయ్యాయి. అంటే వేలానికి తెచ్చిన వాటిలో సుమారు 32.88శాతం వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. నోబిడ్‌లు ఇంచుమించు 25శాతం వరకు ఉన్నాయి. అంటే తెచ్చిన బేళ్లలో నాల్గోవంతు అధికారులు సూచించిన ధరలకు బయ్యర్లు కొనుగోలు చేయక వెనక్కి వెళ్లాయి. ఈ స్థాయిలో నోబిడ్‌లు జరగడం గత రెండు నెలల్లో ఇదే ప్రథమం. కాగా ఆయా వేలం కేంద్రాల వారీ పరిశీలిస్తే.. కనిగిరి కేంద్రంలో శనివారం ఏకంగా 51.83శాతం నోబిడ్ అయ్యాయి. అక్కడికి 465 బేళ్లను వేలానికి తీసుకురాగా 212 కొనుగోలు చేశారు. 241 నోబిడ్ అయ్యాయి. అంటే అక్కడ కొనుగోలు చేసిన బేళ్ల కన్నా నోబిడ్‌లే అధికంగా ఉన్నాయి. అలాగే పొదిలిలో 41.86శాతం, డీసీపల్లిలో 27.41శాతం, వెల్లంపల్లిలో 28.11శాతం బేళ్లు నోబిడ్ అయ్యాయి. అన్ని వేలం కేంద్రాల్లో కలిపి శనివారం సగటు ధర కిలో రూ.153.10 ఉండగా భారీగా నోబిడ్‌లు జరిగిన కనిగిరిలో సగటు ధర కిలో రూ.135.25, అలాగే పొదిలిలో రూ.143.51కు పడిపోయింది.