Share News

స్కూళ్లలో ఇతర కార్యాలయాలు వద్దు

ABN , Publish Date - Nov 17 , 2026 | 02:35 AM

పాఠశాల భవనాల్లో ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలను నిర్వహించడాన్ని పాఠశాల విద్యాశాఖ తప్పుబట్టింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఉత్తర్వులు జారీచేశారు. గతంలోనే ఇలాంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొన్ని పాఠశాలల్లో స్వర్ణవార్డు, స్వర్ణగ్రామాలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

స్కూళ్లలో ఇతర కార్యాలయాలు వద్దు

నివేదిక కోరిన పాఠశాల విద్యాశాఖ

ఒంగోలు విద్య, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : పాఠశాల భవనాల్లో ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలను నిర్వహించడాన్ని పాఠశాల విద్యాశాఖ తప్పుబట్టింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఉత్తర్వులు జారీచేశారు. గతంలోనే ఇలాంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొన్ని పాఠశాలల్లో స్వర్ణవార్డు, స్వర్ణగ్రామాలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో తాజాగా డైరెక్టర్‌ మళ్లీ ఉత్తర్వులు ఇచ్చారు. భవనాలను ఇతర అవసరాలకు వినియోగిస్తున్న స్కూళ్లను గుర్తించి వెంటనే ఖాళీ చేయించా లని ఆర్‌జేడీ, డీఈవోలను ఆదేశించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలను విద్యాశాఖ అధికారులను పరిశీలించాలన్నారు. ఎక్కడైనా ఇతర అవసరాలకు వాడుతున్నట్లు తేలితే వెంటనే ఖాళీ చేయించాలన్నారు. అందుకు అనుమతించిన బాధ్యులైన అధికారుల నుంచి వివరణ కోరాలన్నారు. భవిష్యత్‌లో ఇది పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో అన్సారియా ఆదేశించారు.

Updated Date - Nov 17 , 2026 | 02:35 AM