Share News

రైలు కిందపడి నవ వరుడు ఆత్మహత్య

ABN , Publish Date - Oct 15 , 2026 | 10:51 PM

ఆ ఇంట భాజా భజంత్రీలు మోత ఇంకా రింగుమంటుంది. కాళ్ల పారాణి ఆరక ముందే ఏమైందో ఏమో కాని నవ వరుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో మృతుడు స్వగ్రామమైన తమ్మలూరులో విషాధఛాయలు అలుముకున్నాయి.

రైలు కిందపడి నవ వరుడు  ఆత్మహత్య

- మృతుడు చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

- తమ్మలూరులో విషాదఛాయలు

ముండ్లమూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆ ఇంట భాజా భజంత్రీలు మోత ఇంకా రింగుమంటుంది. కాళ్ల పారాణి ఆరక ముందే ఏమైందో ఏమో కాని నవ వరుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో మృతుడు స్వగ్రామమైన తమ్మలూరులో విషాధఛాయలు అలుముకున్నాయి. మండలంలోని తమ్మలూరు గ్రామానికి చెందిన పూలూరి ఎలమందారెడ్డి, మంగమ్మల ఏకైక కుమారుడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన శ్రీనివాస్‌ రెడ్డి చెన్నైలో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత ఆగస్టు 16న మండలంలోని పూరిమెట్ల గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహమైంది. శ్రీనివాసరెడ్డి భార్యని పుట్టింటిలో ఉంచి చెన్నై ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు. ఏమైందో ఏమో కానీ బుధవారం సాయంత్రం ఒంగోలులో తిరుపతి వెళ్లే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట రైల్వే పోలీసులు గుర్తుతెలియని యువకుడు మృతి కేసుగా నమోదు చేశారు. శ్రీనివాస్‌ రెడ్డి సెల్‌ఫోన్‌కు భార్య ఫోన్‌ చేస్తుండడంతో ఎంత సేపటికి ఎత్తకపోవడంతో కంగారు చెందారు. బుధవారం రాత్రి పోలీసుల నుంచి భార్యకు సమాచారం అందింది. దీంతో ఒక్కసారిగా గుండెలు బాదుకుంది. శ్రీనివాసరెడ్డి తల్లిదండ్రులు కూడా నోటిమాట రాలేనంత పని అయింది. ఒక్కగాని ఒక్క కుమారుడు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక తమకు దిక్కు ఎవరు అంటూ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తుంది.

Updated Date - Oct 15 , 2026 | 10:51 PM