నిధుల వినియోగంలో నిర్లక్ష్యం
ABN , Publish Date - Jul 16 , 2026 | 02:49 AM
పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన కోసం నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని వినియోగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇరువురు హైస్కూలు హెచ్‌ఎంలపై ఆర్‌జేడీ లింగేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు ప్రారంభించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇద్దరు హెచ్‌ఎంలపై ఆర్జేడీ సీరియస్
వెంటనే పనులు చేపట్టకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక
రెండు స్కూళ్లలో విద్యార్థులకు ఇంగ్లీషు పాఠాలు
ఒంగోలు విద్య, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన కోసం నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని వినియోగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇరువురు హైస్కూలు హెచ్‌ఎంలపై ఆర్‌జేడీ లింగేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు ప్రారంభించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్‌జేడీ బుధవారం ఒంగోలు నగర పరిధిలోని వెంగముక్కలపాలెం జడ్పీ హైస్కూ ల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఆ సందర్భంగా పాఠశాలలో అసం పూర్తిగా ఉన్న తరగతి గదులను పరిశీలించి మండిపడ్డారు. నిధులు అందు బాటులో ఉండి, పనులకు అనుమతులు ఇచ్చినా ఎందుకు ప్రారంభించలే దని ప్రశ్నించారు. రెండు రోజుల్లో పనులను ప్రారంభించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. తర్వాత ఒంగోలు రామనగర్‌లోని మునిసిపల్ హైస్కూలు, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అక్కడ నిర్మాణాలు పూర్తికాని తరగతి గదులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. హైస్కూల్‌లో రూ.17 లక్షలు, ప్రాథమిక పాఠశాలలో రూ.5 లక్షలు ఉన్నా పనులు చేపట్టకపోవడంపై మండిపడ్డారు. హైస్కూల్ హెచ్‌ఎంకు రివర్షన్ ఇచ్చి స్కూలు అసిస్టెంట్‌గా పంపుతామని హెచ్చరించారు. ఈ రెండు పాఠ శాలల్లో రెండు రోజుల్లో పనులు ప్రారంభించకపోతే తనకు నివేదించాలని ఒంగోలు ఎంఈవో కిషోర్‌బాబును ఆదేశించారు. ఈ రెండు చోట్లా ఆర్‌జేడీ ఉపాధ్యాయుని అవతారం ఎత్తి విద్యార్థులకు ఇంగ్లీషును బోధించారు.