Share News

మార్కాపురం ఓఎస్డీగా నవజ్యోతి మిశ్రా

ABN , Publish Date - Jul 07 , 2026 | 02:20 AM

మార్కాపురం జిల్లా ఓఎస్డీ (అడ్మిన్‌)గా ఐపీఎస్‌ అధికారి అయిన నవజ్యోతి మిశ్రా నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

మార్కాపురం ఓఎస్డీగా నవజ్యోతి మిశ్రా

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు

మార్కాపురం, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం జిల్లా ఓఎస్డీ (అడ్మిన్‌)గా ఐపీఎస్‌ అధికారి అయిన నవజ్యోతి మిశ్రా నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2021 బ్యాచ్‌కు చెందిన మిశ్రా చింతపల్లి అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏఎస్పీ)గా పనిచేస్తున్నారు. బిహార్‌కు చెందిన ఆయన యూపీఎస్సీ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 2021లో సివిల్స్‌కు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం గ్రేహౌండ్స్‌ కమాండెంట్‌గా పనిచేశారు. తరువాత చింతపల్లి ఏఎస్పీగా 2025 నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. మార్కాపురం ఓఎస్డీగా ఆయన నియామకంతో జిల్లా పోలీస్‌శాఖలో పరిపాలన పర్యవేక్షణకు అవకాశం ఏర్పడింది.

Updated Date - Jul 07 , 2026 | 02:20 AM