నేడు జాతీయ లోక్‌అదాలత్
ABN , Publish Date - Jul 11 , 2026 | 02:51 AM
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శని వారం జాతీయ లోక్ అదాలత్ జరగ నుంది. అందుకు నేషనల్ లీగల్ సర్వీ సెస్ అథారిటీ ఏర్పాట్లు చేసింది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 27 బెంచ్‌ల ఏర్పాటు
ఒంగోలు కలెక్టరేట్, జూలై 10 (ఆంధ్ర జ్యోతి) : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శని వారం జాతీయ లోక్ అదాలత్ జరగ నుంది. అందుకు నేషనల్ లీగల్ సర్వీ సెస్ అథారిటీ ఏర్పాట్లు చేసింది. జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎ.సత్యానంద్ నేతృత్వంలో ఆ సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, అదనపు సీనియర్ సివిల్ న్యాయాధికారి సీహెచ్‌వీ.రామకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. అందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 27 బెంచ్‌లను ఏర్పాటు చేశారు. ఇరువర్గాల ఆమోదంతో వ్యాజ్యాలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని సివిల్, మోటార్ సంబంధ, వివాహ సంబంధ, చెక్‌బౌన్స్ కేసులను ఈ అదాలత్‌లో పరిష్కరించనున్నారు.