Share News

9న జాతీయ లోక్‌ అదాలత్‌

ABN , Publish Date - Apr 28 , 2026 | 01:49 AM

ఉమ్మడి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో వచ్చేనెల 9వ తేదీన జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధి కార సంస్థ చైర్మన్‌, జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయాధికారి టి.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.

9న జాతీయ లోక్‌ అదాలత్‌

అన్ని న్యాయస్థానాల్లో నిర్వహణ

జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయాధికారి రాజ్యలక్ష్మి

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో వచ్చేనెల 9వ తేదీన జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధి కార సంస్థ చైర్మన్‌, జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయాధికారి టి.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో అన్ని రకాల సివిల్‌, రాజీ పడదగిన క్రిమినల్‌ కేసులు, వివాహ సంబంధ వ్యాజ్యాలు, చెక్‌ బౌన్స్‌, మోటారు వాహన ప్రమాద సంబంధ కేసులను ఇరువర్గాల ఆమోదంతో పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల న్యాయ సేవాధికార కమిటీల ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్‌ అదాలత్‌ కోసం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో న్యామూర్తులు, న్యాయవాదుల ఆధ్వర్యంలో బెంచ్‌లను ఏర్పాటు చేస్తామని రాజ్యలక్ష్మి తెలిపారు.

Updated Date - Apr 28 , 2026 | 01:49 AM