ఘనంగా నారా లోకేష్ జన్మదినం
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:27 AM
ప్రతి విద్యార్థి ఉన్నత విద్యనభ్యసించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎయిడెడ్ జూనియర్ కళాశాలల రాష్ట్ర అధ్యక్షులు గారపాటి పుష్పరాజ్, టీడీపీ సీనియర్ నాయకులు నాదెండ్ల కోటేశ్వరరావు పేర్కొన్నారు.
చీరాల, జనవరి23 (ఆంధ్రజ్యోతి) : ప్రతి విద్యార్థి ఉన్నత విద్యనభ్యసించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎయిడెడ్ జూనియర్ కళాశాలల రాష్ట్ర అధ్యక్షులు గారపాటి పుష్పరాజ్, టీడీపీ సీనియర్ నాయకులు నాదెండ్ల కోటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం నారా లోకేష్ జన్మదినం సందర్భంగా స్థానిక సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఎయిడెడ్ కళాశాలల అభ్యున్నతికి మంత్రి సేవలపై కొనియాడారు. విద్యాబుద్ధులపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చీరాల : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తండ్రికి తగిన తనయుడిలా ప్రజాదరణ పొందుతున్నట్లు పలువురు టీడీపీ కూటమి నేతలు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గడియార స్థంభం కూడలిలో టీడీపీ నాయకులు కేక్ కట్ చేశారు. అలాగే ఏరియా వైద్యశాలలో గర్భిణులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల పట్ల నిబద్ధతతో లోకేష్ పనిచేస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తు తరాల నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, ఏఎంసీ చైర్మన్ జనార్ధనరావు, మహిళ నాయకురాలు నాగేంద్రమణి, జనసేన నాయకులు గూడూరు శివరామప్రసాద్ తదితర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మార్టూరు: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్బంగా శుక్రవారం పట్టణంలోని వెంకయ్య ఆశ్రమంలో టీడీపీ నాయకులు, పేదలకు, వద్ధులకు అ న్నదానం చేశారు. అంతేగాకుండా వారికి స్వీట్లును పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు గొట్టిపాటి వెంకట్రావు, డి.రామకృష్ణ, మల్లి, పి.అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
ఇంకొల్లు : ఇంకొల్లులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌బాబు జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాయలంలో కేక్ కట్ చేసి లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ పర్చూరు ఏఎంసీ చైర్మన్ గుంజి వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు నాయుడు హనుమంతరావు, పాలేరు రామకృష్ణ, ఇంకొల్లు సొసైటి అధ్యక్షులు కరి శ్రీనివాసరావు, పార్టీ పట్టణ అధ్యక్షులు వలేరు మార్క్, బేతపూడి సురేష్‌బాబు, పంగులూరి హనుమయ్య, రఫీ, చిలుకూరి శ్రీనివాసరావు, బోడెంపూడి సుబ్బారావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇడుపులపాడు గ్రామానికి చెందిన టీడీపీ వీరాభిమాని హైటెక్ సుభాని కేక్ కట్ చేసి పంచారు.
పర్చూరు : టీడీపీ యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను శుక్రవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పర్చూరు బొమ్మల కూడలిలో తెలుగు తమ్ముళ్లు కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనం తరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు షేక్.షంషుద్దీన్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు మానం హరిబాబు, పట్టణపార్టీ అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు, నాయకులు చెరుకూరి చింపయ్య, కొండ్రగంటి శివనాగేశ్వరరావు, తులసి శ్రీనివాసరావు, కొరిటాల సురేష్, మైనార్జీ యువనేత పఠాన్ సమీర్, మల్లాది సురేష్, షేక్.ఖాజావలి, పఠాన్ బాజీ, షేక్.మాహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని నాగులపాలెం, నూతలపాడు, తిమ్మరాజుపాలెం, అన్నంబొట్లవారిపాలెం, చెరుకూరు తదితర గ్రామాల్లో వేడుకలు జరిగాయి.