యువతకు మై భారత్ యాప్ సేవలు
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:48 PM
మై భారత్ సేవలపై యువతలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు.
విస్తృతంగా అవగాహన కల్పించాలి
కలెక్టర్ రాజాబాబు ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : మై భారత్ సేవలపై యువతలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఇందులో యువత పద్ద సంఖ్యలో నమోదయ్యేలా చూడాలన్నారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని సమావేశపు హాలులో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం జరిగింది. మై భారత్ విభాగం ఏర్పాటు, దీనివల్ల యువతకు, అలాగే వారి సేవల వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలను జిల్లా యూత్ ఆఫీసర్ నరసింహకుమార్ వివరించారు. ఆయా అంశాలపై స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ మై భారత్ మొబైల్ యాప్‌ను 15నుంచి 19 ఏళ్లలోపు యువత ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో ఆయాశాఖల అధికారులు చిరంజీవి, డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, సీవీ రేణుక, నారాయణ, శ్రీనివాసరావు, రమేష్, అర్జున్‌నాయక్, రవితేజ, ఇందిరా కుమారి ఉన్నారు.
మీ కోసం అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి
మీకోసం(ప్రజా సమస్యలపరిష్కార వేదిక)లో వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీసీఎల్‌ఎ జయలక్ష్మీలు అన్ని జిల్లా కలెక్టర్లతో పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్.. అధికారులతో ఆయా అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు.
వ్యాధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు
జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. వ్యాధులపై జాయింట్ ఇన్‌స్పెక్షన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. డయేరియా, వైరల్ ఫీవర్, ఫుడ్ పాయిజన్ వంటి కేసులు వెలుగు చూస్తున్న తీరుపై కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించి దిశానిర్దేశం చేశారు. సంక్షేమ వసతిగృహాల్లోని పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, చిరంజీవి, నారాయణ, నిర్మల జ్యోతి, వరలక్ష్మీ, రేణుక, అనుపమ, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, మునిసిపల్ అధికారులు ఉన్నారు.