మురసు నేలకూల్చింది!
ABN , Publish Date - Nov 12 , 2026 | 02:25 AM
మురసు తుఫాన్‌తో జిల్లాలోని రైతులకు కొంత మేర నష్టం వాటిల్లింది. ఖరీఫ్ సీజన్లో వర్షాలు లేక కరువు వాతావరణంతో పెద్దగా పంటలు వేయలేదు. దీంతో వ్యవసాయ శాఖ పరిఽధిలోని పంటలకు అంతగా లేకపోయినా ఉద్యాన శాఖ పరిధిలోని తోటలు కొంతమేర దెబ్బతిన్నాయి.
ఉద్యాన పంటలకు రూ.6.57 కోట్ల నష్టం
371 మంది రైతులకు చెందిన 168.58 హెక్టార్లలో దెబ్బతిన్న తోటలు
వ్యవసాయశాఖ పరిధిలో మరో 274.19 హెక్టార్లలో నష్టం
ఒంగోలు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : మురసు తుఫాన్‌తో జిల్లాలోని రైతులకు కొంత మేర నష్టం వాటిల్లింది. ఖరీఫ్ సీజన్లో వర్షాలు లేక కరువు వాతావరణంతో పెద్దగా పంటలు వేయలేదు. దీంతో వ్యవసాయ శాఖ పరిఽధిలోని పంటలకు అంతగా లేకపోయినా ఉద్యాన శాఖ పరిధిలోని తోటలు కొంతమేర దెబ్బతిన్నాయి. తుఫాన్ సమయంలో వంద కిలో మీటర్లకుపైన వేగంతో గాలులు వీయడంతో పలుచోట్ల ఉన్న జామ, అరటి, మామిడి, నిమ్మతోటలలో చెట్లు విరిగిపడటం, నేలకూలడం జరిగింది. అక్కడక్కడా కోతలో ఉన్న మిర్చి తోటలు, వివిధ రకాల మొక్కలు పెంచే షెడ్ నెట్స్ వంటి వాటికి కూడా నష్టం వాటిల్లింది. తుఫాన్ తీవ్రత తగ్గిన తర్వాత ఆయా ప్రాంతాలను ఉద్యానశాఖ అధికారులు పరిశీలించారు. వారి అంచనా ప్రకారం జిల్లాలోని 11 మండలాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది.
నష్టాల నివేదిక సిద్ధం
అద్దంకి నియోజకవర్గంలోని అన్ని మండలాల తోపాటు ఇతర నియోజకవర్గాల్లోని మద్దిపాడు, కొత్తపట్నం, తాళ్లూరు, ముండ్లమూరు, సంతనూత లపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో 371 మంది రైతులకు చెందిన సుమారు 168.58 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. దాని వల్ల సంబంధిత రైతులకు సుమారు రూ.6.57 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఉద్యాన శాఖ అధికా రులు అంచనా వేశారు. నిబంధనల ప్రకారం నష్ట పోయిన రైతులకు సుమారు రూ.72.92లక్షల మేర ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం నుంచి అందనుంది. ఆ మేరకు ఉన్నతాఽధికారులకు నివేదించినట్లు ఉద్యాన శాఖ ఏడీ గోపీచంద్ తెలిపారు. ఇదిలాఉండగా వ్యవసాయశాఖ పరిధిలోని పంటలకు కూడా అక్కడక్కడా స్వల్ప నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అధికారులు గుర్తించారు. అద్దంకి నియోజకవర్గంలోని ఐదు మండలాలతోపాటు ముండ్లమూరు, ఎన్జీపాడు మండలాల్లో 371 మంది రైతులకు చెందిన సుమారు 274.19 హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. సంబంధిత నష్టాలపై రైతువారీ, పంటల వారీ నష్టాల అంచనా వేస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.