Share News

ప్రశాంత వాతావరణంలో మున్సిపల్‌ ఎన్నికలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:04 AM

జిల్లాలో ఆదివారం జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ రాజాబాబు వెల్లడించారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూంలో ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారితో కలిసి శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రశాంత వాతావరణంలో మున్సిపల్‌ ఎన్నికలు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజాబాబు, పక్కన ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జేసీ కల్పనాకుమారి

పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

సీసీ కెమెరాలతోపాటు వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు

కలెక్టర్‌ రాజాబాబు వెల్లడి

ఒంగోలు కలెక్టరేట్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఆదివారం జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ రాజాబాబు వెల్లడించారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూంలో ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారితో కలిసి శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికలకు 303 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు, మైక్రో అబ్జర్వర్లు అందరూ కలిపి 2,284 మందిని నియమించినట్లు తెలిపారు. పోలింగ్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు మూడుసార్లు ర్యాండమైజేషన్‌ పూర్తి చేశామన్నారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రానికి వచ్చే వరకు ఏ అధికారి ఏ పోలింగ్‌ కేంద్రానికి వెళ్తారనేది ఎవరికీ తెలి యదన్నారు. బ్యాలెట్‌ పేపర్ల ప్రింటింగ్‌ పూర్తయిందని, మెటీరియల్‌ మొత్తాన్ని స్ట్రాంగ్‌రూంలలో భద్రపర్చారన్నారు. జిల్లాలోని మద్యం షాపులు, బార్‌ షాపులను పూర్తిగా మూసి చేసేలా ఉత్తర్వులు జారీ చేశామని కలెక్టర్‌ వివరించారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు మాట్లాడుతూ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 303 పోలింగ్‌ కేంద్రాల్లో వంద అత్యంత సమస్యాత్మక, 107 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. కౌంటింగ్‌ ముగిసిన అనంతరం విజయం సాధించిన అభ్యర్థులు బాణసంచా కాల్చడం, విజయోత్సవ ర్యాలీలు చేయడాన్ని నిషేధించినట్లు చెప్పారు. ఎన్నికల విధుల కోసం 973మంది పోలీస్‌ సిబ్బందిని నియమించామని ఎస్పీ తెలిపారు. చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రవాణా, భద్రత కోసం రూట్‌ మొబైల్స్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఒంగోలులో 22, చీమకుర్తిలో 5, అద్దంకిలో 6 రూట్‌ మొబైల్స్‌ పనిచేస్తాయని వివరించారు.

Updated Date - Oct 31 , 2026 | 02:05 AM