Share News

ఒంగోలు అభివృద్ధిపై కలెక్టర్‌తో చర్చించిన ఎంపీ, ఎమ్మెల్యే

ABN , Publish Date - Mar 02 , 2026 | 11:05 PM

ఒంగోలు నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై కలెక్టర్‌ రాజాబాబుతో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌లు చర్చించారు.

ఒంగోలు అభివృద్ధిపై కలెక్టర్‌తో చర్చించిన ఎంపీ, ఎమ్మెల్యే
కలెక్టర్‌ రాజాబాబుతో చర్చిస్తున్న ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై కలెక్టర్‌ రాజాబాబుతో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌లు చర్చించారు. సోమవారం రాత్రి స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ను కలిశారు. ముందుగా అగ్రహారం రైల్వే గేటు వద్ద జరుగుతున్న అండర పాస్‌ పనులను పరిశీలించిన అనంతరం కలెక్టర్‌ను కలిసి ఆయా అంశాలపై చర్చించారు. అదేవిధంగా కలెక్టర్‌తో పలు అంశాలపై చర్చించారు. ఈకార్యక్రమంలో ఒడా చైర్మన్‌ షేక్‌ రియాజ్‌ కూడా ఉన్నారు.


అండర్‌ పాస్‌ బ్రిడ్జి పనులను పరిశీలించిన మాగుంట, దామచర్ల

ఒంగోలు కార్పొరేషన్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి : నగర పరిధిలోని అగ్రహారం రైల్వే గేటు వద్ద జరుగుతున్న అండర్‌ పాస్‌ బ్రిడ్జి పనులను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్లజనార్దన్‌ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు సంబంధిత రైల్వే అధికారులు, కాంట్రాక్టర్‌లో మాట్లాడారు. పనుల పురోగతి పరిశీలించడంతోపాటు, త్వరితగతిన పూర్తి చేసి, సమీప ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న బ్రిడ్జి పనులు జరుగుతున్న నేపథ్యంలో రాకపోకలకు కాస్తంత ఇబ్బందులు ఎదురవుతాయ, ప్రజలు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అర్బన్‌ డవల్‌పమెంట్‌ అథారిటీ చైర్మన్‌ షేక్‌ రియాజ్‌, కమిషనరు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 11:05 PM