Share News

మోటారు సైకిళ్లు ఢీ.. ఇద్దరు దుర్మరణం

ABN , Publish Date - Jan 23 , 2026 | 02:26 AM

దురెదురుగా వస్తున్న రెండు మోటారు సైకిళ్లు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మండలంలోని ఆర్‌ఆర్‌పాలెం-గొల్లపాలెం గ్రామాల మధ్య గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకొంది.

మోటారు సైకిళ్లు ఢీ.. ఇద్దరు దుర్మరణం
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ నారాయణ

ఆర్‌ఆర్‌పాలెం-గొల్లపాలెం మధ్య ఘటన

లింగసముద్రం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : ఎదురెదురుగా వస్తున్న రెండు మోటారు సైకిళ్లు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మండలంలోని ఆర్‌ఆర్‌పాలెం-గొల్లపాలెం గ్రామాల మధ్య గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మొగిలిచెర్లకు చెందిన మాజీ రేషన్‌ డీలర్‌ పల్లాల రామ్మూర్తిరెడ్డి (65) స్వగ్రామం నుంచి లింగసముద్రం వస్తున్నారు. ఆర్‌.ఆర్‌.పాలెంకు చెందిన చింతగుంపల మాల్యాద్రి (60) కూలీలను తన పొలంలో వదిలిపెట్టి మోటారు సైకిల్‌పై తన గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురెదురుగా వస్తున్న రెండు మోటారు సైకిళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రామ్మూర్తిరెడ్డిని పరీక్షించి ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మాల్యాద్రిని కందుకూరులోని ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఎస్సై ఎం.నారాయణ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో రెండు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.

Updated Date - Jan 23 , 2026 | 02:26 AM