Share News

తల్లుల క్యూ

ABN , Publish Date - Jul 26 , 2026 | 03:15 AM

తల్లికి వందనం డబ్బులు డ్రా చేసుకునేం దుకు తల్లులు ఉత్సాహంగా బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్తున్నారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులోని హెడ్‌ పోస్టాఫీసులో ఎక్కువ మంది తల్లులకు అకౌంట్లు ఉన్నాయి.

తల్లుల క్యూ
ఒంగోలులోని హెడ్‌ ఫోస్టాఫీసు తెరవకముందే క్యూలో నిల్చొని ఉన్న మహిళలు

ఒంగోలులోని హెడ్‌ పోస్టాఫీసు వద్ద డబ్బుల కోసం బారులు

మరి కొద్దిరోజులు ఇదేపరిస్థితి కొనసాగే అవకాశం

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : తల్లికి వందనం డబ్బులు డ్రా చేసుకునేం దుకు తల్లులు ఉత్సాహంగా బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్తున్నారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులోని హెడ్‌ పోస్టాఫీసులో ఎక్కువ మంది తల్లులకు అకౌంట్లు ఉన్నాయి. ప్రభుత్వం మూడురోజుల క్రితం తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఒక్కొక్కరికి రూ.13వేల చొప్పున విడుదల చేసింది. అవి మహిళలకు ఖాతాలు ఉన్న పోస్టాఫీసులో జమయ్యాయి. దీంతో రెండు రోజులుగా ఒంగోలులోని హెడ్‌పోస్టాఫీసుకు తల్లులు భారీగా తరలివస్తున్నారు. రోజువారీ పోస్టాఫీసు ద్వారా రూ.50 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన వారికి మరుసటిరోజు చెల్లిస్తున్నారు. దీంతో శనివారం పోస్టాఫీసు వద్ద కోలాహలం నెలకొంది. మహిళలు గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చుని డబ్బులు డ్రా చేసుకోవడం కనిపించింది.

Updated Date - Jul 26 , 2026 | 03:15 AM