కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు
ABN , Publish Date - Mar 31 , 2026 | 11:31 PM
కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎం. విజయ సునీతను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
సమస్యలు, అభివృద్ధిపై చర్చ
మార్కాపురం కలెక్టరేట్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎం. విజయ సునీతను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డి నెమలిగుండ్ల రంగనాయకస్వామి చిత్రపటాన్ని బహుకరించి 2, 3 తేదీల్లో జరిగే బ్రహ్మోత్సవాలకు రావల్సిందిగా ఆహ్వానించారు. అలాగు టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి గూ డూరి ఎరిక్షన్‌బాబు కలెక్టర్‌ను కలిశారు. విడివిడిగా కలిసిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జి ఆయా నియోజకర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్‌తో చర్చించారు. బీజేపీ నాయకులు, వీఆర్వోల సంఘం నాయకులు కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు.