Share News

సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న మంత్రి రవికుమార్‌

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:29 PM

అద్దంకి, గిద్దలూరు, పర్చూరులో 220కేవీ సబ్‌స్టేషన్‌ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. సంతమాగులూరు మండలంలోని ఏల్చూరులో ఏపీ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 12 ఎకరాల భూమి కొనుగోలు చేసి రూ.35.78 కోట్లతో నిర్మించనున్న 132/33కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు.

 సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న మంత్రి రవికుమార్‌

అద్దంకి, గిద్దలూరు, పర్చూరులో 220కేవీ సబ్‌స్టేషన్‌ల నిర్మాణం

విద్యుత్‌ చార్జీలను పెంచేదిలేదు

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

సంతమాగులూరు(అద్దంకి), అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి) : అద్దంకి, గిద్దలూరు, పర్చూరులో 220కేవీ సబ్‌స్టేషన్‌ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. సంతమాగులూరు మండలంలోని ఏల్చూరులో ఏపీ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 12 ఎకరాల భూమి కొనుగోలు చేసి రూ.35.78 కోట్లతో నిర్మించనున్న 132/33కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి రవికుమార్‌ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్‌ వినియోగం బాగా పెరిగినప్పటికీ ఇబ్బంది లేకుండా సరఫరా జరుగుతోందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు నయాపైసా కూడా విద్యుత్‌ చార్జీలు పెంచలేదని, రాబోయే రెండున్నరేళ్లలో కూడా పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అద్దంకి నియోజకవర్గంలో ఒక్క సబ్‌స్టేషన్‌ నిర్మాణం కూడా జరగలేదన్న విషయాన్ని ప్రజలు గుర్తుచేసుకోవాలని చెప్పారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిర్మాణం చేసిన సబ్‌స్టేషన్‌లలో షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులు మాత్రం అమ్ముకున్నారని విమర్శించారు. ఏల్చూరులో 132/33కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుతో అద్దంకి, బల్లికురవ, పల్నాడు జిల్లాలోని శావల్యాపురం మండలాలకు మెరుగైన విద్యుత్‌ సరఫరా జరుగుతుందన్నారు. త్వరలో ఏర్పాటుకానున్న రెవెవబుల్‌ ఎనర్జీ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌లో ఏర్పాటయ్యే పర్రిశమలకు భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలలో యువతకు ఉద్యోగం ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. బియ్యం ధరలు పెరగటంతో ప్రభుత్వం కిలో బియ్యం రూ.48లకు విక్రయించే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఎస్‌ఈలు సత్యనారాయణరెడ్డి, కట్టా వెంకటేశ్వర్లు, రాజగోపాలనాయుడు, ఈఈలు మస్తాన్‌రావు, సీహెచ్‌ శ్రీనివాసులు, ఏఈ దీపక్‌, ఏఎంసీ చైర్మన్‌ తేలప్రోలు రమేష్‌, వాసురెడ్డి, ఆలూరి శ్రీనివాసరావు, రామారావు, గాలెయ్య పాల్గొన్నారు.


అద్దంకి పట్టణ సమగ్రాభివృద్ధికి చర్యలు

అద్దంకి పట్టణ సమగ్రాభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. ప్రకాశం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో రూ.1.50 కోట్ల సీఎ్‌సఆర్‌ నిధులతో నిర్మించనున్న ఇండోర్‌ షటిల్‌ కోర్టు, జిమ్‌ల నిర్మాణానికి మంత్రి రవికుమార్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలో రూ.30 కోట్ల హెచ్‌ఏఎం నిధులతో చేపట్టనున్న 173 సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి బ్రహ్మానందం కాలనీ రోడ్డులో మంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

Updated Date - Oct 12 , 2026 | 11:29 PM