దోర్నాలకు చేరిన మంత్రి నిమ్మల
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:57 AM
మండలంలోని కొత్తూరు వద్ద నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకమైన వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం పరిశీలించనున్నారు.
నేడు వెలిగొండ ప్రాజెక్టు సందర్శన
పెద్దదోర్నాల, జూన్ 15 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కొత్తూరు వద్ద నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకమైన వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం పరిశీలించనున్నారు. అందులో భాగంగా ముందురోజే సోమవారం రాత్రి 8 గంటలకు దోర్నాలలోని వెలిగొండ గెస్ట్‌హౌస్‌కు ఆయన చేరుకున్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సీఈ రమేష్, ఎస్‌ఈ అబూతలీమ్, ఫీడర్‌కెనాల్ నిర్మాణ సంస్థ ఎండీ శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దార్ అశోక్‌కుమార్‌రెడ్డి మంత్రి నిమ్మలకు పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరస్వాగతం పలికారు. ఆయన మంగళవారం ఉదయం 6గంటలకు ప్రాజెక్టును సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు.