Share News

నేడు మార్కాపురానికి మంత్రి నిమ్మల రాక

ABN , Publish Date - Aug 13 , 2026 | 02:50 AM

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం మార్కాపురం వస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఆయన ఉదయం 11.45 గంటలకు గుంటూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు మార్కాపురం కలెక్టరేట్‌కు చేరుకుంటారు.

నేడు మార్కాపురానికి మంత్రి నిమ్మల రాక

వెలిగొండ పనుల పరిశీలన

మార్కాపురం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం మార్కాపురం వస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఆయన ఉదయం 11.45 గంటలకు గుంటూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు మార్కాపురం కలెక్టరేట్‌కు చేరుకుంటారు. అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడతారు. 4 గంటలకు గొట్టిపడియ డ్యామ్‌ వద్దకు చేరుకుని పరిశీలిస్తారు. అనంతరం దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద ఫీడర్‌ కాలువను పరిశీలిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి వెలిగొండ టన్నెల్‌, టీబీఎం తొలగింపు, లైనింగ్‌ పనులను చూస్తారు. రాత్రి 10.30 గంటలకు బయల్దేరి విజయవాడ వెళతారు.

Updated Date - Aug 13 , 2026 | 02:50 AM