ఏఆర్‌టీ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి
ABN , Publish Date - Sep 09 , 2026 | 11:12 PM
అద్దంకి ప్రభుత్వ వైద్యశాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో హెచ్‌ఐవీ బాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో 65 లక్షల రూపాయలతో నిర్మించిన ఏఆర్‌టీ సెంటర్‌ను బుధవారం మంత్రి ప్రా రంభించారు.
రూ.65 లక్షలతో నిర్మాణం
అద్దంకి ప్రభుత్వ వైద్యశాల మరింత అభివృద్ధికి కృషి : గొట్టిపాటి
అద్దంకి, సెప్టెంబరు9 (ఆంధ్రజ్యోతి) : అద్దంకి ప్రభుత్వ వైద్యశాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో హెచ్‌ఐవీ బాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో 65 లక్షల రూపాయలతో నిర్మించిన ఏఆర్‌టీ సెంటర్‌ను బుధవారం మంత్రి ప్రా రంభించారు. ఏఆర్‌టీ సెంటర్ నిర్మాణానికి సీఎ్‌సఆర్ నిధులు ఇచ్చిన రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులను మంత్రి అభినందించారు. అద్దంకిలో ఏఆర్‌టీ సెంటర్ ఏర్పాటుతో 8 మండలాల్లోని హెచ్‌ఐవీ బాధితులకు మరిం త వెసులబాటు కలుగుతుందన్నారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులతో మా ట్లాడి వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వైద్యులు, సిబ్బందితో ప లు అంశాలపై సమీక్షించారు. వైద్యశాలలో పారిశుధ్య సమస్య, ప్రహరీ నిర్మాణం, పడకల పెంపు విషయమై మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. పారిశుధ్య పనులను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమీషనర్ రవీంద్రను మంత్రి ఆదేశించారు. వైద్యశాలలోని సమస్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టి కి తీసుకుపోయి పరిష్కరిస్తానని గొట్టిపాటి హామీ ఇచ్చారు. వైద్యశాలలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేసి కమిటీ సభ్యుల ద్వారా సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నానన్నారు.
ఆర్‌వో ప్లాంట్ ప్రారంభం
నీటిని వృథా చేయకుండా భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసుకోవాలని, మంత్రి రవికుమార్ చెప్పారు. అద్దంకి పట్టణంలోని 20వ వార్డులో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఎల్‌నినోను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే నీటి వనరులను సంరక్షించుకోవటం ఎంతో కీలకం అన్నారు. చెరువులు, కాలువలు, వాగులు ఆక్రమణలకు గురికాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
128మందికి రూ.1,04 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 128 మందికి 1,04 కోట్ల రూపాయల సీఎం రిలీ్‌ఫఫండ్ చెక్కులు, ఎల్‌ఓసీ పత్రాలను మంత్రి అందజేశారు. నియోజకవర్గంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 3802 మందికి 31,14 కోట్ల రూపాయల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశామని మంత్రి చెప్పారు.
అన్నా క్యాంటిన్‌లో భోజనం చేసిన మంత్రి
అద్దంకి పట్టణంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి రవికుమార్ అన్న క్యాంటిన్‌ను మంత్రి రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సామాన్యుడిలా అందరితో కలిసి భోజనం చేశారు. భోజనం చేస్తున్న పేదలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు.