రేపు ఎర్రగొండపాలెంలో మంత్రి గొట్టిపాటి పర్యటన
ABN , Publish Date - May 20 , 2026 | 02:27 AM
రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందుకు వైపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
మార్కాపురం, మే 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందుకు వైపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. దోర్నాలలో బస్టాండ్ లేక చాలాకాలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని గుర్తించిన ప్రజా ప్రభుత్వం ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. తొలుత మంత్రి దోర్నాలలోని ఆర్టీసీ బస్టాండ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే దూపాడు నుంచి దోర్నాలకు సాగర్ జలాలు అందించే పైపులైన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం దోర్నాల మండలం చిన్నగుడిపాడుకు చేరుకుంటారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్యానెళ్లను ప్రారంభిస్తారు. అనంతరం పుల్లలచెరువు మండలం ఐటీవరంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొంటారు.