మహిళకు ఆటో అందజేసిన మంత్రి గొట్టిపాటి
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:08 PM
పీఎం అజయ్ పథకం ద్వారా మంజూరైన ప్రయాణికుల ఆటోను రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం సంబంధిత మహిళకు అందచేశారు.
పంగులూరు, జూలై 15(ఆంధ్రజ్యోతి) : పీఎం అజయ్ పథకం ద్వారా మంజూరైన ప్రయాణికుల ఆటోను రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం సంబంధిత మహిళకు అందచేశారు. మండలంలోని ముప్పవరం గ్రామానికి చెందిన ఎస్‌హెచ్ గ్రూప్ సభ్యురాలు వరపర్ల ప్రసన్నకుమారికి పీఎం అజయ్ పథకం ద్వారా ప్రయాణికుల ఆటో మంజూరైంది. 3 లక్షల విలువైన ఆటో పొందేందుకు లబ్ధిదారు రూ.30 వేలు చెల్లించగా, 2 లక్షల 20వేల రూపాయలు వెలుగు ద్వారా రుణం, మిగిలిన రూ.50వేలు పీఎం అజయ్ పథకం ద్వారా రాయితీ లభించినట్లు ఏపీఎం కోటేశ్వరరావు తెలిపారు. సంతమాగులూరులో మంత్రి గొట్టిపాటి ద్వారా పంపిణీ చేసిన ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జ్ కుక్కపల్లి ఏడుకొండలు, వరపర్ల సుబ్బారావు, దాసరి హనుమంతరావు, ిసీసీ సురేష్ పాల్గొన్నారు.
ఏడుగురికి ఎల్‌వోసీ పత్రాల అందజేత
సంతమాగులూరు(అద్దంకి), జూలై 15(ఆంధ్రజ్యోతి) : పేదల ఆరోగ్యానికి ప్రజాప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. అత్యవసర వైద్యం కోసం ఏడుగురికి మంజూరైన ఎల్‌వోసీ పత్రాలను బుధవారం సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం అడ్డరోడ్డు వద్ద క్యాంప్ కార్యాలయంలో మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యం కోసం ప్రజా ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఎల్‌వోసి పత్రాలు అందజేస్తోందన్నారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారంపై అధికారులతో మాట్లాడారు.