అక్రమ క్వారీయింగ్‌పై మైనింగ్ అధికారుల దాడి
ABN , Publish Date - Apr 08 , 2026 | 03:00 AM
మండలంలోని తురకపల్లి అటవీ ప్రాంతంలో తెల్లరాయి (వైట్‌క్వార్ట్జ్) అక్రమ తవ్వకాలపై మంగళవారం మైనింగ్ అధికారులు దాడి చేశారు. ‘తురకపల్లిలో తెల్లరాయి దొంగలు’ శీర్షికన మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. మైనింగ్ ఏడీ రవిప్రసాద్ ఆధ్వర్యంలో దాడులు చేసి అనుమతులు మండలంలోని తురకపల్లి అటవీ ప్రాంతంలో తెల్లరాయి (వైట్‌క్వార్ట్జ్) అక్రమ తవ్వకాలపై మంగళవారం మైనింగ్ అధికారులు దాడి చేశారు. ‘తురకపల్లిలో తెల్లరాయి దొంగలు’ శీర్షికన మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. మైనింగ్ ఏడీ రవిప్రసాద్ ఆధ్వర్యంలో దాడులు చేసి అనుమతులు లేకుండా జరుగుతున్న తవ్వకాలను గుర్తించారు. లేకుండా జరుగుతున్న తవ్వకాలను గుర్తించారు.
ఎక్స్‌కవేటర్, 100 టన్నుల తెల్లరాయి స్వాధీనం
పీసీపల్లి, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని తురకపల్లి అటవీ ప్రాంతంలో తెల్లరాయి (వైట్‌క్వార్ట్జ్) అక్రమ తవ్వకాలపై మంగళవారం మైనింగ్ అధికారులు దాడి చేశారు. ‘తురకపల్లిలో తెల్లరాయి దొంగలు’ శీర్షికన మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. మైనింగ్ ఏడీ రవిప్రసాద్ ఆధ్వర్యంలో దాడులు చేసి అనుమతులు లేకుండా జరుగుతున్న తవ్వకాలను గుర్తించారు. అక్కడ క్వారీయింగ్ చేస్తున్న ఎక్స్‌కవేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా వెలికితీసిన సుమారు 90 నుంచి 100 టన్నుల తెల్లరాయి రా మెటీరియల్‌ను కూడా స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేయడం చట్టరీత్యా నేరమని ఈ సందర్భంగా ఏడీ తెలిపారు. విచారణ చేపట్టి క్వారీయింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ దాడుల్లో మైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్ కె.బాలరాజు, అసిస్టెంట్ జియాలజిస్టు బి.పోలిరెడ్డి, తిరుపతిరావు, ఆర్‌ఐ మాధవరెడ్డి పాల్గొన్నారు.