కనీస వేతనాలను అమలు చేయాలి
ABN , Publish Date - Jul 06 , 2026 | 01:26 AM
షె డ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.వెంకటేశ్వర్లు తెలిపారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు
కందుకూరు, జూలై 5(ఆంధ్రజ్యోతి): షె డ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.వెంకటేశ్వర్లు తెలిపారు. కందుకూరు పట్ట ణంలోని నారాయణ జూనియర్ కాలేజీలో కం దుకూరు నియోజకవర్గస్థాయి సీఐటీయూ నా యకత్వ శిక్షణ శిబిరాలు ఆదివారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లా డుతూ షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కా ర్మికులకు గత 15 సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదన్నారు. వివిధ ప్రభుత్వ స్కీమ్‌లలో పనిచేస్తున్న అంగన్‌వాడీ, ఆశా, వీవోఏ, మధ్యా హ్నభోజన కార్మికులకు ప్రభుత్వ శాఖలలో ప నిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కు కనీస వేతనాలు అమలు కావటం లేదని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై ఈనెల 30,31 తేదీల్లో కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలకు కార్మికులు అధికసంఖ్యలో హాజరుకావాలని కో రారు. ఈ కార్యక్రమంలో జీవీబీ.కుమార్, సీహె చ్.ఇందిరావతి, ఎస్.గీత, చిలకా శ్రీనివాసులు, పి.మస్తాన్, బి.మాధవి, జడ రమణయ్య, పొ ట్లూరి పోలమ్మ, నేలటూరి తిరుపాలు, బీవీ.రా వు, ఎస్‌డీ గౌస్‌బాషా, ఎ.జయలక్ష్మి, సాధు చె న్నకేశవులు, శిరీషా, పీవీ.రామారావు, బి. మార్త మ్మ, సులోచన, ఫరీమా, ఎం.సుభాను తదిత రులు పాల్గొన్నారు.