Share News

కనీస సౌకర్యాలు కల్పించాలి

ABN , Publish Date - Nov 11 , 2026 | 01:28 AM

త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహ ణకు కనీస వసతులు కల్పించాలని ఫ్యాప్టో జిల్లా శాఖ ప్రతినిధులు జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారిని కోరారు. ఈమేరకు ఆమెకు మంగళవారం వినతిపత్రం సమర్పిం చారు.

కనీస సౌకర్యాలు కల్పించాలి
జేసీ కల్పనాకుమారికి వినతిపత్రం ఇస్తున్న ఫ్యాప్టో ప్రతినిధులు

ఇబ్బందులు ఉన్న టీచర్లకు పంచాయతీ

ఎన్నికల నుంచి మినహాయింపు ఇవ్వాలి

జేసీని కోరిన ఫ్యాప్టో ప్రతినిధులు

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహ ణకు కనీస వసతులు కల్పించాలని ఫ్యాప్టో జిల్లా శాఖ ప్రతినిధులు జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారిని కోరారు. ఈమేరకు ఆమెకు మంగళవారం వినతిపత్రం సమర్పిం చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడిన విషయాన్ని ఈ సందర్భంగా వారు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. స్పెషల్‌ కేటగిరీ టీచర్లకు, 60 ఏళ్లకుపైబడిన వారికి, గర్భిణులు బాలింతలకు పంచాయతీ ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇచ్చేలా చూడాలని కోరారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో డ్యూటీ చేసిన ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన భత్యం కొంతమందికి రాలేదని తెలిపారు. వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీని కలిసిన వారిలో ఫ్యాప్టో ప్రతినిధులు షేక్‌ అబ్దుల్‌హై, బి.శేషారావు, జి.శివశంకర్‌, కిలారి వెంకటేశ్వర్లు, చల్లా శ్రీనివాసులు, డి.మధు, వి.రవి, జి.ఉమామహేశ్వరి, ఎస్‌.వెంకటేశ్వర్లు, వై.వెంకట్రావు, ఎన్‌.చిన్నస్వామి, పి.సుబ్బారావు, ఆదినారాయణ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 11 , 2026 | 01:28 AM