24న మెగా పీటీఎం
ABN , Publish Date - Jul 18 , 2026 | 01:48 AM
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 24న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం)ను పండుగ వాతావర ణంలో నిర్వహించనున్నారు. పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమర్థవంతమైన భాగస్వా మ్యాన్ని కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
పండుగ వాతావరణంలో నిర్వహణకు ఏర్పాట్లు
విద్యార్థుల తల్లిదండ్రులకు వివిధ పోటీలు
ఒంగోలు విద్య, జూలై 17 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 24న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం)ను పండుగ వాతావర ణంలో నిర్వహించనున్నారు. పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమర్థవంతమైన భాగస్వా మ్యాన్ని కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు పాఠశాల విద్య రాష్ట్ర డైరెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో మెగా పీటీఎంను పెద్ద ఈవెంట్‌గా నిర్వహిస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో పెరెంట్స్ మీటింగ్‌లను భారీస్థాయిలో నిర్వహించినందుకు రాష్ట్రప్రభుత్వానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కింది. ప్రస్తుతం కూడా అదే స్థాయిలో ఏర్పాటుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పాఠశాలల్లో పోటీలు నిర్వహించనున్నారు.