15న సంతమాగులూరులో ‘మీకోసం’
ABN , Publish Date - May 13 , 2026 | 03:06 AM
అద్దంకి నియోజకవర్గ పరిధిలోని సంతమాగులూరులో ఈనెల 15న మీకోసం కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెలలో ప్రతి శుక్రవారం ఒక నియోజకవర్గంలో మీకోసం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.
సజ్జాపురంలో కలెక్టర్ పల్లె నిద్ర
ఒంగోలు కలెక్టరేట్, మే 12 (ఆంధ్ర జ్యోతి) : అద్దంకి నియోజకవర్గ పరిధిలోని సంతమాగులూరులో ఈనెల 15న మీకోసం కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెలలో ప్రతి శుక్రవారం ఒక నియోజకవర్గంలో మీకోసం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. దీంతో ఈనెల 15న సంతమాగులూరులోని ఎంపీడీవో కార్యాలయం వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగించను న్నారు. జిల్లాస్థాయి అధికారులంతా హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించను న్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ రాజాబాబు ఒక ప్రకటనలో కోరారు. అదేరోజు రాత్రి సంతమాగులూరు మండలంలోని సజ్జాపురంలో కలెక్టర్ పల్లెనిద్ర చేయనున్నారు. గ్రామస్థులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి సమస్యలను తెలుసుకుంటారు. రాత్రికి అక్కడే బసచేసి శనివారం ఉదయం ఆ గ్రామంలో పర్యటి స్తారు. ఇదిలా ఉండగా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు సంతమాగులూరు మండలంలోని ఒక్కో పంచాయతీకి