Share News

పీహెచ్‌సీల్లో వైద్యసేవలు మెరుగు

ABN , Publish Date - Feb 25 , 2026 | 02:34 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండగా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెరుగుపడింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుతున్న వైద్యసేవలను ప్రామాణికంగా తీసుకొని జిల్లాస్థాయిలో ర్యాంకింగ్‌ ఇస్తున్నారు.

పీహెచ్‌సీల్లో వైద్యసేవలు మెరుగు

ఏ-గ్రేడ్‌లో మద్దిపాడు వైద్యశాల

19 బీ-గ్రేడ్‌.. ఐదు డీ-గ్రేడ్‌

ఐదు అంశాలు ప్రామాణికంగా వైద్యశాఖ ర్యాంకింగ్‌

ఒంగోలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండగా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెరుగుపడింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుతున్న వైద్యసేవలను ప్రామాణికంగా తీసుకొని జిల్లాస్థాయిలో ర్యాంకింగ్‌ ఇస్తున్నారు. ప్రస్తుత జిల్లాలో 39 పీహెచ్‌సీలు ఉండగా ఆ కేంద్రాల్లో ఐదు అంశాలను ప్రామాణికంగా తీసుకొని ర్యాంకింగ్‌ ఇవ్వగా మద్దిపాడుకు గ్రేడ్‌ ఏ వచ్చింది.

అందుబాటులోనే అన్ని పరీక్షలు, మందులు..

మద్దిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జనవరిలో ఓపీలు 1,973, ఇన్‌పేషెంట్లు 110, డెలివరీలు 2, ల్యాబ్‌ టెస్టులు 3,460, ఐయూసీడీ తొమ్మిది చేశారు. దీంతో జిల్లాలో మద్దిపాడు పీహెచ్‌సీ జిల్లాలో ఏగ్రేడ్‌ సాధించి మొదటిస్థానంలో నిలిచింది. అదేవిధంగా జిల్లాలో బీగ్రేడ్‌లో 14 కేంద్రాలు, సీ-గ్రేడ్‌లో 19 కేంద్రాలు, డి-గ్రేడ్‌లో ఐదు పీహెచ్‌సీలు నిలిచాయి, చివరి గ్రేడ్‌లో మోదేపల్లి, మారెళ్ల, మేదరమెట్ల, కొరిశపాడు, టంగుటూరు ప్రాథమిక కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పీహెచ్‌సీల్లో అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచడంతోపాటు అన్నిరకాల వైద్య పరీక్షలు(టెస్టులు) కూడా చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన ప్రతి రోగికి వైద్యసేవలు అందించాలని నిర్దేశించడంతో తదనుగుణంగా జిల్లాలో గతం కన్నా కొంతమేర మెరుగుపడింది.

Updated Date - Feb 25 , 2026 | 02:34 AM