Share News

బండరాళ్లపైనే భోజనాలు

ABN , Publish Date - Oct 22 , 2026 | 03:23 AM

మండలంలోని పేరుంబొట్లపాలెంలో 200 ఏళ్ల నుంచి ఓ వింత ఆచారం కొనసాగుతోంది. ఆ గ్రామానికి చెందిన ఒక వర్గం వారు అమ్మవారిని ఏటా పూజించడం ఆనవాయితీగా వస్తోంది. కరువు వచ్చిన సందర్భంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించడం మరో ఆచారంగా పాటిస్తున్నారు.

బండరాళ్లపైనే భోజనాలు
బండరాళ్లపై భోజనాలు చేస్తున్న పేరుంబొట్లపాలెం గ్రామస్థులు

పేరుంబొట్లపాలెంలో 200 ఏళ్ల నుంచి

కొనసాగుతున్న వింత ఆచారం

కరువు వచ్చిన సందర్భంలో ప్రత్యేక పూజలు

పురుషుల ఆధ్వర్యంలో కార్యక్రమం

కురిచేడు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి) : మండలంలోని పేరుంబొట్లపాలెంలో 200 ఏళ్ల నుంచి ఓ వింత ఆచారం కొనసాగుతోంది. ఆ గ్రామానికి చెందిన ఒక వర్గం వారు అమ్మవారిని ఏటా పూజించడం ఆనవాయితీగా వస్తోంది. కరువు వచ్చిన సందర్భంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించడం మరో ఆచారంగా పాటిస్తున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో బుధవారం ఆ వర్గం వారు కొండమీది దుగ్గిలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే వంట వండి కొండమీద బండరాళ్లపైనే వారందరూ భోజనాలు చేశారు. అనంతరం బండరాళ్లను శుభ్రం చేయకుండా వారు అలాగే వదిలి వెళ్లారు. అమ్మవారు కరుణించి వర్షం కురిపించి బండరాళ్లను శుభ్రం చేస్తుందని వారి విశ్వాసం. పూజతోపాటు వంటావార్పు కార్యక్రమాలలో పురుషులు మాత్రమే పాల్గొంటారు. మహిళలు దూరంగా ఉంటారు. పేరుంబొట్లపాలెంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలలో వందమంది వరకు భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 03:23 AM