Share News

భారీగా పనులు

ABN , Publish Date - Sep 17 , 2026 | 02:58 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార-జలహారతి పనులు జిల్లాలో భారీగా జరిగాయి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పరిధిలో వివిధ వనరుల పునరుద్ధరణ, పటిష్టత, సమర్థ నిర్వహణకు సంబంధించి సుమారు రూ.37.14 కోట్లు వెచ్చించారు.

భారీగా పనులు
ఆర్డీటీ సహకారంతో అభివృద్ధి చేసిన దొనకొండ మండలం రుద్రసముద్రం చెరువు

రూ.37.14 కోట్ల వ్యయం ..

15.33 లక్షల పని దినాల కల్పన

జలధార - జలహారతి తొలిదశలో 2,445 పనులు పూర్తి

చెరువులు, ఇతర వనరులకు నీరు వచ్చే వాటికి ప్రాధాన్యం

రూ.66 లక్షల ఆర్డీటీ సహకారంతో రెండు చెరువుల పునరుద్ధరణ

రెండో దశలో మరో 2,239 వర్క్‌ల గుర్తింపు... 1,074 ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార-జలహారతి పనులు జిల్లాలో భారీగా జరిగాయి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పరిధిలో వివిధ వనరుల పునరుద్ధరణ, పటిష్టత, సమర్థ నిర్వహణకు సంబంధించి సుమారు రూ.37.14 కోట్లు వెచ్చించారు. ఆయా వనరులకు సంబంధించి 2,445 పనులు పూర్తి చేయడం ద్వారా ఉపాధి కూలీలకు సుమారు 15.33 లక్షల పని దినాలను కల్పించారు. అలా నీటి వనరుల అభివృద్ధితోపాటు కూలీలకు కరువు వేళ పెద్దఎత్తున ఉపాధి లభించింది.

ఒంగోలు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో కురిసే వర్షపు నీరు వృఽథాగా పోకుండా నీటి వనరులకు చేర్చి నిల్వ చేయడమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం జలధార-జలహారతి పేరుతో వంద రో జుల కార్యక్రమాన్ని ఏప్రిల్‌లో చేపట్టింది. తొలుత సాగు నీటి చెరువులకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించినప్పటికీ అందుకు భారీ వ్యయం కానున్న నేపఽథ్యంలో డ్వామా పరిధిలోని వీబీ జీరామ్‌జీ పథకం ద్వారా అవకాశం ఉన్న పనులు చేయాలని నిర్దేశించింది. ప్రధానంగా వర్షపు నీరు చెరువులు, ఇతర వనరులకు వచ్చే ఫీడర్‌ కాలు వలు, వాగులు, వంకలు, చెక్‌డ్యాంలలో పూడికతీత, పునరుద్ధరణ, వాటిని మరింత సమర్థవంతంగా నీటి నిల్వ కోసం వినియోగించుకునేందుకు అవసరమైన పనులు చేపట్టాలని సూచించింది. తద్వారా భూగర్భ జలాలు కూడా పెరిగేలా చూడాలని ఆదేశించింది. జిల్లాలో డ్వామా సిబ్బంది గ్రామ, గ్రామానా వేలాది పనులను గుర్తించారు. అలాంటి వాటిలో 2,447 పనులను జూన్‌, జూలైలలో పెద్దఎత్తున చేసి ఆగస్టు ఆఖరు నాటికి పూర్తిచేశారు. అలా 2,445 పనులు పూర్తిచేయగా వాటి ద్వారా ఉపాధి కూలీలకు సుమారు 15.33 లక్షల పనిదినాలు లభించాయి.

రూ. 37కోట్ల మేర వేతనాలు

ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో సుమారు 78 లక్షల పని దినాలను వివిధ పనుల ద్వారా ఉపాధి కూలీలకు కల్పించగా అందులో దాదాపు 15.33 లక్షల పనిదినాలను జలధార-జలహారతి పనుల నుంచే కల్పించారు. తద్వారా సుమారు రూ.37కోట్ల మేర వేతనాలు కూలీలకు లభించాయి. అదేసమయంలో అనేక నీటి వనరులు మెరుగుపడ్డాయి. మరోవైపు భూగర్భ జలాలు అత్యంత లోతుకు వెళ్లిన దొనకొండ మండలంలోని చెరువులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో కొన్ని చెరువుల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈక్రమంలో గ్రామీణాభివృద్ధి ట్రస్ట్‌ (ఆర్డీటీ)ని అధికారులు సంప్రదించడంతో రూ.66 లక్షల వ్యయంతో ఆ మండలంలోని రెండు చెరువుల అభివృ ద్ధికి ఆ సంస్థ ముందుకొచ్చింది. దీంతో రుద్రసముద్రం, పుల్లాయపల్లిల్లోని చెరువులను మోడల్‌ ట్యాంకులుగా అభివృద్ధి చేశారు.

రెండో దశ పనులు మొదలు

ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం కూడా ఉపాధి కూలీలకు ప్రభుత్వం పనులను కల్పిస్తోంది. రోజువారీ సగటున 40 నుంచి 50 వేల మంది కూలీలు పనులకు వస్తున్నారు. దీంతో జలధార-జలహారతి రెండో దశ పనులను కూడా చేపట్టారు. రెండో దశ కింద జిల్లాలో 2,239 పనులను డ్వామా సిబ్బంది గుర్తించగా 177 పనులకు జిల్లా అధికారులు పరిపాలనా ఉత్తర్వులు ఇచ్చారు. అందులో 1,074 పనులను కిందిస్థాయిలో కూలీల చేత చేయించడాన్ని సిబ్బంది ప్రారంభించగా, 176 పనులను పూర్తి చేసినట్లు సమాచారం. తద్వారా కూలీలకు పెద్దఎత్తున పనులు కల్పించి వేతనాలు అందించడంతోపాటు నీటి వనరుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Sep 17 , 2026 | 02:58 AM