Share News

భారీగా నోబిడ్‌లు

ABN , Publish Date - Aug 06 , 2026 | 03:09 AM

దక్షిణాది పొగాకు మార్కెట్లో మళ్లీ నోబిడ్‌లు భారీగా పెరిగాయి. బుధవారం ఈ ప్రాంతంలోని రెండు రీజియన్లలో కలిపి సగటున సుమారు 33శాతం బేళ్లు నోబిడ్‌ అయ్యాయి. వాటిలో ఎస్‌బీఎస్‌ రీజియన్‌లో 38.95శాతం, ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియ న్‌లో 27.03శాతం ఉన్నాయి.

భారీగా నోబిడ్‌లు

ఎస్‌బీఎస్‌ రీజియన్‌లో 38.95శాతం

టంగుటూరులో నిలిచిన వేలం

వెల్లంపల్లిలో ఆగి సాగిన కొనుగోళ్లు

అక్కడ 54.40 శాతం బేళ్లు నోబిడ్‌

సగటు ధర, రోజువారీ కొనుగోలు

పరిమాణం కూడా తగ్గుదల

ఒంగోలు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్లో మళ్లీ నోబిడ్‌లు భారీగా పెరిగాయి. బుధవారం ఈ ప్రాంతంలోని రెండు రీజియన్లలో కలిపి సగటున సుమారు 33శాతం బేళ్లు నోబిడ్‌ అయ్యాయి. వాటిలో ఎస్‌బీఎస్‌ రీజియన్‌లో 38.95శాతం, ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియ న్‌లో 27.03శాతం ఉన్నాయి. ధరలు కూడా తగ్గాయి. టంగుటూరు కేంద్రంలో కొనుగోళ్ల తీరుపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వేలాన్ని అడ్డుకోవడంతో అక్కడ కొనుగోళ్లు నిలిచిపోయాయి. వెల్లంపల్లిలో కూడా రైతుల నిరసనలతో ఆగి సాగింది. అయినా అక్కడ ఏకంగా 54.40శాతం బేళ్లు నోబిడ్‌ అయ్యాయి. ఆ కేంద్రంలో మంగళవారం కొనుగోళ్లు నిలిచిపోగా ఆ బేళ్లను బుధవారం వేలానికి పెట్టారు. అయినా కొనుగోలు చేసేందుకు బయ్య ర్లు ముందుకు రాలేదు. దక్షిణాదిలోని రెండు రీజియన్లలో బుధవారం మొత్తం 6,565 బేళ్లకు వేలం నిర్వహించగా 4,070ను మాత్రమే కొనుగోలు చేశారు. వివిధ కారణాలతో 2,495 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. వాటిలో 2,136 బేళ్లను బోర్డు అధికారులు సూచించిన ధరకు బయ్యర్లు కొనుగోలు చేయక నోబిడ్‌ అయ్యాయి. అలా వేలం జరిగిన బేళ్లలో సుమారు 33శాతం నోబిడ్‌లు కాగా.. వాటిలో అత్యధికంగా వెల్లంపల్లిలో 54.40శాతం, ఒంగోలు-1లో 45.22శాతం, ఒంగోలు-2లో 37.11శాతం, కందుకూరు-2లో 37.64శాతం, కనిగిరిలో 31.18శాతం, డీసీపల్లిలో 30.58శాతం ఉన్నాయి. రెండు రీజియన్లలో సగటు ధరలు, కొనుగోలు పరిమాణం కూడా తగ్గింది. సగటున కిలోకు రూ.186.12 ధర లభించగా, రెండు రీజియన్లలో కలిపి 0.54 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోలు జరిగింది. మంగళవారం నాటితో పోల్చితే అన్ని అంశాల్లోనూ బుధవారం మార్కెట్‌ రివర్స్‌లోనే నడిచింది.

Updated Date - Aug 06 , 2026 | 03:09 AM