మంత్రి లోకేష్ పర్యటనకు భారీ ఏర్పాట్లు
ABN , Publish Date - Aug 27 , 2026 | 11:34 PM
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకే్‌షఒంగోలు పర్యటనకు విచ్చేయనుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ మొదలైంది. యువగళం యాత్ర అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా మంత్రి హోదాలో ఒంగోలు వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు ఇటు పార్టీ శ్రేణులు, అటు అధికార యంత్రాంగం భారీఏర్పాట్లు చేస్తున్నారు.
కిమ్స్ వద్ద విగ్రహాలు ఆవిష్కరణ
అమృత్ 2.0 పైలాన్ ఆవిష్కరణ
నగరమంతా ఫ్లెక్సీలతో స్వాగతాలు
నగర సుందరీకరణలో కార్పొరేషన్ అధికారులు
నగరంలో భారీగా బైక్ ర్యాలీ ఏర్పాటు
ఒంగోలు కార్పొరేషన్, ఆగస్టు (ఆంధ్రజ్యోతి) : టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకే్‌షఒంగోలు పర్యటనకు విచ్చేయనుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ మొదలైంది. యువగళం యాత్ర అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా మంత్రి హోదాలో ఒంగోలు వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు ఇటు పార్టీ శ్రేణులు, అటు అధికార యంత్రాంగం భారీఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వారం రోజులుగా ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయ్‌కుమార్‌లు నియోజకవర్గ శ్రేణులతో సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. శుక్రవారం మంత్రి లోకేష్ పర్యటనతో నగరమంతా పసుమయం చేసి, అభిమాన నేతకు అఖండ స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కట్టారు. మంత్రి లోకేష్ కాన్వాయ్ ముందు పార్టీ శ్రేణుల, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడానికి ఏర్పాట్లు సిద్ధం చేశారు.
ఒంగోలు 150 వేడుకలలో భాగంగా విగ్రహాలు ఆవిష్కరణ
ఒంగోలు మునిసిపాలిటీ ఏర్పాటై 150 సంవత్సరాలు వేడుకలను పురస్కరించుకుని కార్పొరేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంగా నగర అభివృద్ధిలో భాగంగా రూ.1.70 కోట్ల వ్యయంతోచేపట్టిన పనులనుమంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కిమ్స్ హాస్పిటల్ జంక్షన్ వద్ద ఒంగోలు జాతి ఎద్దు కీర్తి తెలియజేసేలా విగ్రహం ఏర్పాటు చేయగా, దానిని మంత్రి లోకేష్ ఆవిష్కరించనున్నారు. అలాగే ఒంగోలుతో సంబంధం కలిగి, వివిధ రంగాలలో పేరుగాంచిన పలువురు ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయడంతో వాటిని లోకేష్ ఆవిష్కరించనున్నారు. అదే ప్రాంతంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద అందమైన పూలమొక్కలు, ఆకట్టుకునే రంగులతో నిర్మించిన గ్రీన్‌పార్కును మంత్రి లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించనుండగా, అందుకు సంబంఽధించి కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాటు పూర్తి చేశారు.
తాగునీటికి శాశ్వత పరిష్కారం లభించేలా
నగర ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న అమృత్ 2.0 పథక పనులకుమంత్రి లోకేష్ స్థానిక రంగారాయుడు చెరువు వద్ద పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ పథకానికి ఒంగోలు నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.424.42 కోట్లు నిధులు కేటాయించగా, రెండేళ్లలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. పబ్లిక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో అమృత్ పనులు చేపడుతుండగా, 13.975 కి.మీ శుద్ధి కేంద్రాలకు నీటి సరఫరా చేసే పైపులైను, అలాగేత్రోవగుంట, కొప్పోలు, పబ్లిక్ హెల్త్ ఆఫీస్ కాంపౌండ్‌లో కోటి యాభై లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు నీటి శుద్ధి కేంద్రాలు నిర్మించనున్నారు. వాటితోపాటు 52.985 కి.మీ. శుద్ధి చేసిన తాగునీటి పంపింగ్ ప్రధాన పైపులైను నిర్మాణం, 18 ప్రాంతాల్లో తాగునీటి నిల్వ ట్యాంకులు, నగరం మొత్తాన్ని 35 జోన్‌లుగా విభజించి 605.30 కి.మీ పైపులైను నిర్మాణం, 51,340 నివాసాలకు ఇంటింటికీ కొళాయిలు నిర్మించనున్నారు. ఈ పనులు పూర్తయితే రోజూ మంచినీరు అందించి, నగరంలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించేలా చేపట్టిన పనులకు మంత్రి లోకేష్ పైలాన్ ఆవిష్కరించనున్నారు.
నగరమంతా పసుపుమయం
మంత్రి లోకేష్ నియోజకవర్గంలోకి ప్రవేశించినపప్పటి నుంచి ఆయన పర్యటించే రోడ్డు మార్గంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తొలిసారిగా ఒంగోలు రానుండటంతో అందుకు అనుగుణంగా అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన పర్యటించే రోడ్డుమార్గమంతా పసుపు తోరణాలతో పసుమయం చేశారు. ఇందుకు సంబంధించి కిమ్స్ హాస్పిటల్ వద్ద అభివృద్ధి పనుల ప్రారంభం, రంగారాయుడు చెరువు పైలాన్ ఆవిష్కరించనుండగా, అనంతరం రామ్‌నగర్ 10వ లైను వద్ద అంబేద్కర్ నగర్‌లో మంత్రి లోకేష్ పార్టీ శ్రేణులతో సమావేశం కానుండటంతో ఆ ప్రాంతమంతా పసుమయంతో పండుగ వాతావరణంలా మార్చేశారు.