ఉరి వేసుకుని వివాహిత మృతి
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:07 AM
ఉరి వేసుకుని వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని జమ్మలమడక గ్రామంలో గురువా రంరాత్రి చోటుచేసుకుంది.
పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ తల్లిదండ్రులు
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
కనిగిరి, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : ఉరి వేసుకుని వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని జమ్మలమడక గ్రామంలో గురువా రంరాత్రి చోటుచేసుకుంది. మృతురాలి తల్లితండ్రుల ఫిర్యాదుతో శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అనుమానస్పద మృతిగా ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల తెలిపిన వివరాల మేరకు... నల్లదిన్నె భాగ్యలక్ష్మీ(26) జమ్మలమడక గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డితో 12ఏళ్ల క్రితం వివాహమైంది. వారిరువురికి ఇద్దరు కుమార్తెలు ఉన్నా రు. ఇటీవల తరచూ భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడ్డాయి. గురువారం మళ్లీ గొడవపడ్డారు. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయం లో భాగ్యలక్ష్మీ ఉరి వేసుకుంది. ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామానికి చెందిన తల్లిదండ్రులు.. కుమార్తె మరణవార్త తెలుసుకుని జమ్మలమడక గ్రామానికి వచ్చి మృతదేహాన్ని పరిశీంచి అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సందీప్ సిబ్బందితో ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేశారు.
బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 20ఏళ్లు జైలు
ఒంగోలు క్రైం, జూలై 24(ఆంధ్రజ్యోతి) : బాలికపై అత్యాచారం చేసిన సాదు శ్యామ్ అలియాస్ శ్యామ్ సుందరరావుకు 20 ఏళ్లు జైలు, రూ.10 వేలు జరిమాన విధిస్తూ న్యాయాధికారి కే.శైలజ శుక్రవారం తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కఽఽథనం మేరకు... గుడ్లూరు మండలం పరకొండపాడులో 2020 జూన్ 8న బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో 49 ఏళ్ల వయస్సు గల సాదు శ్యామ్ ఇంట్లోకి చొరబడ్డాడు. బాలిక నోరు మూసి అత్యాచారం చేశాడు. అప్పట్లో గుడ్లూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అనేక మంది సాక్షులను విచారించిన పోక్సో కోర్టు న్యాయాధికారి శైలజ తీర్పు ఇచ్చారు. నిందితుడు శ్యామ్‌పై నేరం నిర్ధారణ కావడంతో 20 ఏళ్లు జైలు శిక్షతోపాటు రూ.10 వేలు జరిమానా విఽధిస్తూ తీర్పు చెప్పారు. బాధితురాలుకు రూ.2.50 లక్షలు పరిహారం అందజేయాలని డీఎల్ ఎస్‌ఏను ఆదేశించారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పీపీ గొట్టిపాటి శ్రీనివాసరావు తమ వాదనలు వినిపించారు. కేసులో సమర్థవంతంగా విధులు నిర్వహించిన అప్పటి డీఎస్పీ కండే శ్రీనివాసరావు, పోలీసు సిబ్బందిని ఎస్పీ వి.హర్షవర్ధనరాజు అభినందించారు.