జిల్లా అభివృద్ధికి ‘మార్క్’పురం
ABN , Publish Date - Jun 18 , 2026 | 11:34 PM
జిల్లాలో వ్యవసాయం, పర్యాటకం, నీటివనరుల వృద్ధి, పరిశ్రమల ఏర్పాటు తదితర రంగాల్లో అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నా యి. వీటి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల తయారీపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. నాలుగు నియోజకర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జి ఆధ్వర్యంలో జిల్లాలో అవకాశాల ఆధారంగా వీటిని రూపొందిస్తున్నారు.
పక్కా ప్రణాళికల తయారీలో అధికారులు, ప్రజాప్రతినిధులు
మెండుగా అవకాశాలు
వ్యవసాయం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలపై దృష్టి
రెండేళ్ల ప్రగతితో మరింత ఉత్సాహంతో ముందుకు
కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉన్న అవకాశాలు, వనరులను సమర్థంగా వాడుకొని ప్రగతి సాధనకు కృషి చేస్తోంది. ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తై వాడవాడలా విజయోత్సవం మారుమోగుతున్న వేళ.. ఇప్పటివరకు సాధించిన ప్రగతికి తోడు జిల్లాలో ఉన్న అవకాశాలు సంపూర్ణంగా వినియోగించి అభివృద్ధిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రణాళిక రూపొందుతోంది. అభివృద్ధి, సంక్షేమం ప్రధాన ధ్యేయంగా ప్రజాప్రభుత్వం ముందుకెళుతుండటంతో కొత్త జిల్లాలో పలు అభివృద్ధి పనులకు రూపకల్పన వేగంగా సాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల అమలుతోపాటు కొత్తగా వివిధ ప్రాంతాల అభివృద్ధి, పలు రంగాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను గుర్తించి వాటిపై దృష్టి సారిస్తున్నారు. జిల్లాలో గత రెండేళ్లలో రూ.2,391 కోట్లను అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది.
మార్కాపురం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వ్యవసాయం, పర్యాటకం, నీటివనరుల వృద్ధి, పరిశ్రమల ఏర్పాటు తదితర రంగాల్లో అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నా యి. వీటి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల తయారీపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. నాలుగు నియోజకర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జి ఆధ్వర్యంలో జిల్లాలో అవకాశాల ఆధారంగా వీటిని రూపొందిస్తున్నారు.
వెలిగొండ పూర్తితో మారనున్న జిల్లా రూపు
జిల్లా అభివృద్ధికి ప్రధాన పునాది వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తే. గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ పనులను పూర్తిచేయకపోగా మోసపూరిత చర్యతో జగన్ జాతికి అంకితం చేయడాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ఈ దశలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాప్రభుత్వం వెలిగొండ అవసరాన్ని గుర్తించి పనులను వేగంగా చేపట్టి పూర్తిచేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది. అందులో కీలక భాగమైన ఫీడర్ కెనాల్ పనులను రూ.456 కోట్లతో సీఎం చంద్రబాబు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇవికాకుండా ఇటీవల మరో రూ.906 కోట్లను వెలిగొండ ముంపు గ్రామాల నిర్వాసితుల కోసం మంజూరు చేసింది. ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఎంతశ్రద్ధ చూపుతుందో ప్రజలు గుర్తించారు. వెలిగొండతోపాటు రైతుల అవసరాలకు ప్రయోజనకరంగా నీటి వనరుల వృద్ధి కోసం చెక్‌డ్యాంలు, నీటికుంటల నిర్మాణాలతోపాటు జలధార జలసంరక్షణ పేరుతో చెరువుల అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి.
పర్యాటకంతో జిల్లా అభివృద్ధికి కొత్తదారి
జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిసఉత్సాహంగా పాల్గొన్న కలెక్టర్ విజయసునీత, టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్, అధికారులు, యువత ప్రతిపాదనలు తయారుచేస్తున్నారు. ప్రధానంగా ఆధ్యాత్మిక పర్యాటకంలో భాగంగా మార్కాపురం శ్రీలక్ష్మి చెన్నకేశవస్వామి దేవస్థానం, త్రిపురాంతకం దేవస్థానం, రాచర్ల నెమలిగుండ్ల రంగనాయకస్వామి, భైరవకోన, మిట్టపాలెం నారాయణస్వామి, సురభేశ్వరకోన వంటి దేవాలయాల అభివృద్ధితోపాటు పర్యాటక ప్రాంతాలుగా ఉన్న అవకాశాలపై దృష్టి సారించారు.
జల పర్యాటకంలో భాగంగా కంభం చెరువును అభివృద్ధి చేసేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నారు. కంభం చెరువు తాగు, సాగు నీటికే కాకుండా పర్యాటక రంగానికి కూడా ప్రధాన కేంద్రంగా గుర్తించి అక్కడ చెరువు కట్ట అభివృద్ధి, వ్యూ పాయింట్‌లు, బోటింగ్, కాటేజీలు, ఫుడ్‌కోర్టులు, గెస్ట్ హౌస్‌ల నిర్మాణం, కృష్ణదేవరాయలు, వరదరాజమ్మ చరిత్ర తెలిపే ఫొటో గ్యాలరీ ఏర్పాటు, రాత్రి లైటింగ్ ఏర్పాట్లతో రాష్ట్ర స్థాయి పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు.
ఎకో టూరిజంలో భాగంగా నల్లమల అటవీ ప్రాంత అందాలను అవకాశాలుగా చేసుకుని సహజసౌందర్య వనరులు, కొండలు, జలాశయాలు, చెరువులు, ప్రకృతిదారులను కలుపుకుంటూ ఎకో టూరిజం ఏర్పాటుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందులో భాగంగా ట్రెక్కింగ్ మార్గాలు, బర్డ్ వాచింగ్ పాయింట్లు, క్యాంపింగ్ ప్రాంతాలు, హోమ్ స్టేలు ఏర్పాటుపై అటవీశాఖ అధికారులు ఇక్కడ ఉన్న అవకాశాలు గుర్తిస్తున్నారు. ఎకో టూరిజం వల్ల గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి.
జిల్లాలో పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రజాప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీటి ద్వారా ఉపాధి అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో మెరుగవుతాయి. కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలంలో 497 ఎకరాల్లో రూ.130 కోట్లతో సీబీజీ యూనిట్ నిర్మాణం జరుగుతోంది. కొనకనమిట్ల మండలం వాగుమడుగు వద్ద 1900 ఎకరాల్లో రూ.260 కోట్లతో మరో సీబీజీ యూనిట్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా జిల్లాలోని సుమారు 2 వేల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయి. పీసీపల్లి మండలం ఇర్లపాడు వద్ద 20 ఎకరాల్లో రూ.7కోట్లతో ఎంఎ్‌సఎంఈ పార్కు, తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద రూ.7 కోట్లతో ఎంఎ్‌సఎంఈ పార్కు నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. వీటిద్వారా 12 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది.
ఉద్యానహబ్ రైతులకు వరం
రాయలసీమ హార్టికల్చర్ హబ్‌లో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉండటం ఈ ప్రాంత రైతులకు వరంగా మారింది. ఇప్పటికే ఉద్యానహబ్ పనులు ప్రారంభం అవుతుండగా రైతులు కూడా ఉద్యాన పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. వివిధ పంటలకు ప్రోత్సాహాలు, రైతుల భూముల్లోకి రవాణా సౌకర్యాల ఏర్పాటుకు రోడ్ల నిర్మాణాలు, రాయితీపై పరికరాలు అందజేయటం, రైతుల పంట నిల్వ కోసం నిర్మాణాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, రక్షణ చర్యలు ఇలాంటి ఎన్నో సదుపాయాలు హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులకు అందనున్నాయి. అటు వెలిగొండ, ఇటు హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో వ్యవసాయ రంగానికి ఎన్నడూలేని ఊపు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా జిల్లాలో ఉన్న ఎన్నో అవకాశాలు ఉపయోగించి అభివృద్ధి వైపు జిల్లాను నడిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవతోపాటు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తోడవటం శుభపరిణామం.