Share News

లారీ క్యాబిన్‌ నుంచి జారి పడి వ్యక్తి మృతి

ABN , Publish Date - Aug 26 , 2026 | 11:19 PM

ప్రయాణిస్తున్న లారీలో క్యాబిన్‌ డోర్‌ తెరుచుకుని ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ముప్పవరం గ్రామంలో జాతీయ రహదారిపై సాయిబాబా మందిరం సమీపంలో మంగళవారం రాత్రి 12.45 నిమిషాలకు చోటుచేసుకుంది.

లారీ క్యాబిన్‌ నుంచి   జారి పడి వ్యక్తి మృతి

పంగులూరు, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి) : ప్రయాణిస్తున్న లారీలో క్యాబిన్‌ డోర్‌ తెరుచుకుని ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ముప్పవరం గ్రామంలో జాతీయ రహదారిపై సాయిబాబా మందిరం సమీపంలో మంగళవారం రాత్రి 12.45 నిమిషాలకు చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... మదనపల్లి నుంచి ఓ లారీ టమాటో లోడుతో తెనాలి వెళుతుండగా ముప్పవరం సాయిబాబా మందిరం వద్దకు చేరుకున్న సమయంలో క్యాబిన్‌ డోర్‌ తెరుచుకుని అందులో ప్రయాణిస్తున్న జట్టు కోటిరెడ్డి(56) ప్రమాదవశాత్తు రోడ్డుపై పడి మృతి చెందాడు. కోటిరెడ్డి గుంటూరు జిల్లా తెనాలి పట్టణం గంగానమ్మపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

మేదరమెట్ల, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రహదారిలో వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. బుధవారం మేదరమెట్ల-నార్కెట్‌పల్లి రహదారిలో బొడ్డువానిపాలెం వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధుడిని కారు ఢీకొన్న సంఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వృద్ధుడు వివరాలు తెలియరాలేదు. మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 26 , 2026 | 11:19 PM