గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:23 PM
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓవ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని శాంతినగర్ దగ్గర జాతీయరహదారిపై ఆదివారం చోటుచేసుకుంది.
గుడ్లూరు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓవ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని శాంతినగర్ దగ్గర జాతీయరహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు, స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. శాంతినగర్ గిరిజన కాలనీకి చెందిన కొమరగిరి రామయ్య (40) అనే వ్యక్తి ఆదివారం ఉదయం శాంతినగర్ వద్ద జాతీయరహదారి దాటి, తమ కాలనీలోకి వెళుతున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఆ తరువాత కొంత సేపటికి అటుగా వెళుతున్న కొందరు ప్రయాణికులు కిందపడి ఉన్న వ్యక్తిని గమనించి హూటాహుటిన కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే రామయ్య మృతి చెందాడు. మృతుడి భార్య కె. లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్రావు ఆదివారం తెలిపారు.