Share News

టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:20 PM

ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టి మోటార్‌ సైక్లిస్ట్‌ మృతి చెందిన సంఘటన మంగళవారం స్థానిక ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మండలంలోని రాయవరం గ్రామానికి చెందిన గాయం వెలుగొండారెడ్డి(78) మృతి చెందాడు.

టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి

మార్కాపురం టౌన్‌, జూలై 7 (ఆం ధ్రజ్యోతి) : ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టి మోటార్‌ సైక్లిస్ట్‌ మృతి చెందిన సంఘటన మంగళవారం స్థానిక ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మండలంలోని రాయవరం గ్రామానికి చెందిన గాయం వెలుగొండారెడ్డి(78) మృతి చెందాడు. పట్టణ ఎస్‌ఐ పి.విశ్వనాథరెడ్డి కథనం మేరకు... మండలంలోని రాయవరం గ్రామానికి చెందిన గాయం వెలుగొండారెడ్డి టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ బైక్‌పై మార్కాపురం నుంచి రాయవరం వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో రాయవరంలో వాటర్‌ సరీసింగ్‌ చేయించుకున్న టిప్పర్‌ వాహనం మార్కెట్‌ యార్డ్‌ వైపు బయలుదేరింది. ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ సమీపంలోని వై.జంక్షన్‌ వద్దకు వచ్చే సరికి మోటార్‌ సైకిల్‌, టిప్పర్‌ రెండు ఎదురుపడ్డాయి. ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను తప్పించబోయిన వెలుగొండారెడ్డి మోటార్‌ సైకిల్‌తో లారీ ముందు వైపు ఢీకొట్టాడు. దీంతో ఎగిరి కింద పడిన అతనిని 108 వాహనంలో సర్వజన వైద్యజన వైద్యశాలకు తరలించారు మార్గమధ్యలోనే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్తాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విశ్వనాథరెడ్డి తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

గిద్దలూరు టౌన్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని దిగువమెట్ట చెంచుకాలనీలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. దిగువమెట్ట చెంచుకాలనీ వద్ద గల ప్రాథమిక పాఠశాల వెనుక సుమారు 40 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతిచెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన వ్యక్తి ఆనవాళ్లను సేకరించారు. మృతుడు గుర్తు తెలియని వ్యక్తి, అతని సమాచారం ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

Updated Date - Jul 07 , 2026 | 11:20 PM