Share News

పల్లె మెరిసేలా...!

ABN , Publish Date - Sep 29 , 2026 | 01:04 AM

గ్రామీణ ప్రాంతాలకు తీపికబురు. ముఖ్యంగా రోడ్లకు మహర్దశ పట్టింది. పల్లెపండుగ 3.0 కింద భారీగా పనులు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ విడత గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్‌ రోడ్లు, డ్రెయిన్‌లు నిర్మించను న్నారు.

పల్లె మెరిసేలా...!
పల్లెపండుగలో తారు రోడ్డుగా మారనున్న మెటల్‌ రోడ్డు

గ్రామీణ రహదారులకు మహర్దశ

జిల్లాకు రూ.132 కోట్లతో 435 పనులు మంజూరు

నేడు పల్లెపండుగ 3.0 ప్రారంభం... మడనూరులో జిల్లాస్థాయి కార్యక్రమం

పాల్గొననున్న ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే జనార్దన్‌, కలెక్టర్‌ రాజాబాబు

ఇతర నియోజకవర్గాల్లోనూ నేతలతో శంకుస్థాపనలు

నేడు నెల్లూరు జిల్లా రామాపురంలో రాష్ట్రస్థాయి కార్యక్రమం

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ హాజరు

కొండపి, కందుకూరు నియోజకవర్గాల నుంచి తరలుతున్న జనం

222 ప్రత్యేక బస్సులు ఏర్పాటు.. కనిగిరి నుంచి వేలాది మంది సిద్ధం

గ్రామీణ ప్రాంతాలకు తీపికబురు. ముఖ్యంగా రోడ్లకు మహర్దశ పట్టింది. పల్లెపండుగ 3.0 కింద భారీగా పనులు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ విడత గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్‌ రోడ్లు, డ్రెయిన్‌లు నిర్మించను న్నారు. హ్యాబిటేషన్‌లను అనుసంధానం చేసే మెటల్‌ రోడ్ల స్థానంలో తారురోడ్లతో పాటు ఇతర పలు పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రస్థాయిలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం రామా పురంలో మంగళవారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పాల్గొంటున్నారు. అదేసమయంలో జిల్లాలోనూ నియోజకవర్గ స్థాయిలో శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. జిల్లాస్థాయి కార్యక్రమం కొత్తపట్నం మండలం మడనూరులో ఏర్పాటు చేశారు.

ఒంగోలు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : పల్లె పండుగ 3.0 కింద మంజూరైన పనులు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ విడత సుమారు రూ.10వే ల కోట్లతో వివిధ రకాల పనులు చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్‌ రోడ్లు, డ్రెయిన్‌లు, హ్యాబిటేషన్లను అనుసంధానం చేసే మెటల్‌ రోడ్ల స్థానంలో తారురోడ్లతోపా టు ఇతర పలు వర్కులు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రస్థాయిలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరి కుంటపాడు మండలం రామాపురంలో మంగ ళవారం కార్యక్రమం ప్రారంభం కానుంది. అదేసమయంలో రాష్ట్రవ్యాప్తంగా నియోజకవ ర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనులకు శంకుస్థాపనలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలోని ఒక్కో నియోజకవర్గానికి రూ.20కోట్ల వంతున, ఎంపీ మాగుంట సిఫార్సు మేరకు మరో రూ.11 కోట్లు వెరసి ఇంచుమించు రూ.132 కోట్లతో 435 పనులు మంజూరయ్యాయి.

మడనూరులో శంకుస్థాపనలు

ఆయా పనులకు మంగళవారం జిల్లాలోనూ శంకుస్థాపనలు చేస్తున్నారు. ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నం మండలం మడనూరులో జిల్లాస్థాయి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్‌ రాజా బాబు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. సాయంత్రం వెల్లంపల్లిలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌, కలెక్టర్‌ ప్రారంభించనున్నారు. అలా అన్ని నియోజక వర్గాల్లోనూ స్థానిక నేతలు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇదిలాఉండగా సీఎం, డిప్యూటీ సీఎంలు పాల్గొననున్న రామాపురం సభకు ఉమ్మడి జిల్లా నుంచి భారీగా ప్రజలు, టీడీపీ శ్రేణులు తరలివెళ్తున్నారు.

జిల్లా నుంచి భారీగా తరలనున్న శ్రేణులు

జిల్లాలోని కందుకూరు, కొండపి నియోజకవర్గాల నుంచి సుమారు 15వేల మంది సీఎం కార్యక్రమానికి తరలి వెళ్లనున్నారు. ప్రత్యేకంగా వారి కోసం 222 బస్సులను ఏర్పాటు చేయగా ప్రైవేటు వాహనాలు ఇతర సొంత వాహనాల్లోనూ పెద్దసంఖ్యలో వెళ్తున్నారు. కాగా రామాపురం సభ జరిగే ప్రాంతం మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గ సరిహద్దు కావడంతో ఆ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలివెళ్తున్నట్లు తెలుస్తోంది. సుమారు 20వేల మంది వరకు వెళ్లేలా అక్కడి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సారఽథ్యంలో ఏర్పాట్లు జరిగాయి. ఇదిలాఉండగా జనసమీకరణపై కందుకూరులో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మూడు రోజులుగా ఏర్పాట్లు జరుగుతుండగా సోమవారం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర టీడీపీ పరిశీలకుడు దేవినేని ఉమామహేశ్వరరావులు ఎమ్మెల్యే నాగేశ్వరరావుతో కలిసి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సభకు వెళ్లే వారికి మాలకొండ సమీపంలో భోజనాలు ఏర్పాటు చేస్తుండగా అక్కడి ఏర్పాట్లను వారు పరిశీలించారు.

Updated Date - Sep 29 , 2026 | 01:04 AM