కనిగిరిలో భారీ అగ్నిప్రమాదం
ABN , Publish Date - Oct 22 , 2026 | 03:25 AM
కనిగిరిలో ని సామిల్స్ వీధిలో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మూడు ఉడ్ కటింగ్ షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. వాటిలోని విలు వైన యంత్రాలతోపాటు వినియోగదారులు కటింగ్ కోసం తీసుకొచ్చిన టేకు, వేప కలప అగ్నికి ఆహు తైంది. రూ.30లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
మూడు ఉడ్ కటింగ్ షాపులు దగ్ధం
రూ.30 లక్షల మేర ఆస్తి నష్టం
బాధితులను ఆదుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర హామీ
కనిగిరి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : కనిగిరిలో ని సామిల్స్ వీధిలో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మూడు ఉడ్ కటింగ్ షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. వాటిలోని విలు వైన యంత్రాలతోపాటు వినియోగదారులు కటింగ్ కోసం తీసుకొచ్చిన టేకు, వేప కలప అగ్నికి ఆహు తైంది. రూ.30లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాఽథమికంగా భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సామిల్స్ వీధిలో ఒక వరుస అంతా సామిల్స్, ఉడ్ కటింగ్ షాపులు ఉన్నాయి. మంగళవారం రాత్రి 7.30 సమయంలో మూడు షాపుల నుంచి మంటలు చెలరేగాయి. స్థాని కులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈలోపు బకెట్లతో నీళ్లు తెచ్చి పోసి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని దాదాపు రెండు గంటలు శ్రమించి ఎగసిపడుతున్న అగ్నికీలలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే షాపుల్లో ఉన్న నాలుగు చిత్రిక మిషన్లు, రెండు పాలిషింగ్ మిషన్లు పూర్తిగా కాలిపోయాయి. ప్రజలు తమ అవసరాల కోసం తీసుకొచ్చిన టేకు, వేప కలప అగ్నికి ఆహుతయ్యాయి. కళ్లముందే షాపులు, యంత్రాలు, కలప కాలిపోవడంతో యజమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
బాధితులకు అండగా ఉంటాం
ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి మంగళవారం రాత్రి ఘటనా స్థలా నికి చేరుకొని పరిశీలించారు. బాధిత షాపు యజమా నులు పెడమన కనకాచారి, ఎలివల శివప్రసాద్, బాలాల ఆచారి (మహేష్)లను పరామర్శించి వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జరిగిన నష్టంపై వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు తగిన నష్టపరిహారం అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.