టీడీపీ ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్తగా మద్దిపాటి
ABN , Publish Date - May 14 , 2026 | 03:09 AM
తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలకు పార్లమెంట్ స్థానాలను అధిష్ఠానం కేటాయించింది. రాష్ట్రవ్యా ప్తంగా పదిమంది ముఖ్య నాయకులను సమన్వ యకర్తలుగా నియమించింది. వారికి రెండు నుంచి మూడు పార్లమెంట్ స్థానాలను కేటాయిం చింది.
అనంతపురానికి దామచర్ల సత్య నియామకం
ఒంగోలు, మే 13 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలకు పార్లమెంట్ స్థానాలను అధిష్ఠానం కేటాయించింది. రాష్ట్రవ్యా ప్తంగా పదిమంది ముఖ్య నాయకులను సమన్వ యకర్తలుగా నియమించింది. వారికి రెండు నుంచి మూడు పార్లమెంట్ స్థానాలను కేటాయిం చింది. ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్తగా ఏలూరు జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజును నియమించింది. దాదాపు దశాబ్ద న్నర కాలంగా ఆ జిల్లాలో క్రియాశీలకంగా పనిచే స్తున్న వెంకటరాజు గత అసెంబ్లీ ఎన్నికల్లో గోపాలపురం ఎమ్మెల్యేగా అప్పటి రాష్ట్రమంత్రి తానేటి వనితపై గెలుపొందారు. జిల్లాకు చెందిన రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కూడా సమన్వయకర్తలలో ఉన్నారు. గతంలో ఆయన ఉత్తరాంధ్ర జోనల్ కోఆర్డినేటర్‌గా పని చేశారు. ఈసారి ఆయన్ను అనంతపురం, హిందూపురం పార్లమెంట్ స్థానాలకు సమన్వయ కర్తగా నియమించారు