గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:26 PM
మేత కోసం వెళ్లిన గొర్రెలు తిరిగి ఇంటికి వెళుతుండగా లారీ తొక్కించుకుంటూ వెళ్లింది. ఈ సంఘటన కొమరోలులోని నాయారా పెట్రోల్ బంకు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
25 జీవాలు మృతి
కొమరోలు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : మేత కోసం వెళ్లిన గొర్రెలు తిరిగి ఇంటికి వెళుతుండగా లారీ తొక్కించుకుంటూ వెళ్లింది. ఈ సంఘటన కొమరోలులోని నాయారా పెట్రోల్ బంకు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కడప జిల్లా పోరుమామిళ్ల మండలం నాగులకుంట్ల గ్రామానికి చెందిన కృష్ణయ్య, ప్రవీణ్ మరో ఇద్దరు కలిసి 10రోజుల కిందట గొర్రెల మేత కోసం పొదలకుంటపల్లి, గిద్దలూరు ప్రాంతాలకు వచ్చారు. గొర్రెలను మేపుకొని తిరిగి నాగులకుంట్ల వెళుతుండగా మంగళవారం వేకువజామున కొమరోలులోని నాయరా పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డు దాటుతుండగా పోరుమామిళ్ల నుంచి ఎర్రగొండపాలెం వెళ్తున్న ఇసుక లారీ మందపైకి వేగంగా దూసుకొచ్చింది. ఈ సంఘటనలో 25గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందగా మరో 10 తీవ్రంగా గాయపడ్డాయి. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ నాగరాజు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.