ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Jan 24 , 2026 | 01:39 AM
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆ పార్టీ శ్రేణులు ఆయా ప్రాంతాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
జిల్లావ్యాప్తంగా కేక్ కటింగ్‌లు, రక్తదాన శిబిరాలు
పలుచోట్ల ప్రజాప్రతినిధులు, నేతలు హాజరు
ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు
ఒంగోలు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆ పార్టీ శ్రేణులు ఆయా ప్రాంతాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు పట్టణాలు, మండల కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో కేక్ కటింగ్‌లతోపాటు రక్తదాన శిబిరాలను నిర్వహించారు. సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. కొండపిలో జరిగిన వేడుకల్లో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొని కేక్ కట్ చేశారు. పెద్దసంఖ్యలో పార్టీశ్రేణులు పాల్గొన్నాయి. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. నగరంలోని మంగమూరురోడ్డులో సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్.విజయకుమార్ కార్యాలయంలో జరిగిన లోకేష్ జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ ముఖ్యనేతల సమక్షంలో బీఎన్ కేక్ కట్ చేశారు. కందుకూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అక్కడి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. దర్శి మండలం తూర్పువెంకటాపురం, దర్శి పట్టణాల్లో నిర్వహించిన వేడుకల్లో టీడీపీ దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని కేక్ కట్ చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.