రూ.360 కోట్లతో ఎస్సీలకు రుణాలు
ABN , Publish Date - Jul 29 , 2026 | 02:49 AM
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా త్వరలోనే రూ.360కోట్ల రుణాలను అందజేయనున్నట్లు మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి వెల్లడించారు. మంగళవారం ఒంగోలు వచ్చిన ఆమె ముందుగా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, దళిత సంఘాల నాయకులతో చ ర్చించారు. కార్పొరేషన్ ద్వారా త్వరలో అమలు చేయబోయే పథకాలు, వాటి ద్వారా ఎస్సీ నిరుద్యోగ యువతకు ఒనగూరే ప్రయోజనాలను వివరించారు.
మాదిగ కార్పొరేషన్ చైర్మన్ శ్రీదేవి
జగన్ దళిత ద్రోహి.. బాబు బాంధవుడు
ఒంగోలు నగరం, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా త్వరలోనే రూ.360కోట్ల రుణాలను అందజేయనున్నట్లు మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి వెల్లడించారు. మంగళవారం ఒంగోలు వచ్చిన ఆమె ముందుగా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, దళిత సంఘాల నాయకులతో చ ర్చించారు. కార్పొరేషన్ ద్వారా త్వరలో అమలు చేయబోయే పథకాలు, వాటి ద్వారా ఎస్సీ నిరుద్యోగ యువతకు ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. అనంతరం మీడియా సమావేశంలో శ్రీదేవి మాట్లాడారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.360 కోట్లతో రుణాలను అందజేస్తామన్నారు. ఎస్సీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు ఇన్నోవా కార్లు, ఎక్స్‌కవేటర్లు, ఈ-ఆటోలు సబ్సిడీపై అందించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్సులను ఆధునికీకరిస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. ఎస్సీ నిధులను పక్కదారి పట్టించి జగన్ దళిత ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయారని మండిపడ్డారు. దళిత బాంధవుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్థానం చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిచిపోనుందని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఎస్సీ కార్పొరేషన్‌కు పూర్వవైభవం తెస్తామన్నారు. కార్యక్రమంలో ఈడీ అర్జున్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.