Share News

ఆక్వా రంగ అభివృద్ధికి విరివిగా రుణాలు ఇవ్వాలి

ABN , Publish Date - Apr 16 , 2026 | 11:31 PM

జిల్లాలో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రైతులకు విరివిగా రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజాబాబు ఆదేశించారు.

ఆక్వా రంగ అభివృద్ధికి విరివిగా రుణాలు ఇవ్వాలి

కలెక్టర్‌ రాజాబాబు ఆదేశం

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రైతులకు విరివిగా రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజాబాబు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ సమావేశపు హాలులో గురువారం ఆక్వా కల్చర్‌ రంగానికి సంబంధించి ముఖ్య భాగస్వామ్యులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ముందుగా అందుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. చిన్న, అతి చిన్న ఆక్వా రైతులకు కిసాన్‌ క్రిడెట్‌ కార్డు రుణాల మంజూరు, పంట భీమా ఆధారంగా రుణాలు, రైతుల ఉత్పత్తిని కొనుగోలు చేయడం వంటి అంశాలపై చర్చించారు. రైతులపై పడుతున్న ఇన్‌పుట్‌ సబ్సిడీ ఖర్చులను తగ్గించడం, వారి ఉత్పత్తులకు మెరుగైన ధరలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు బ్యాంకర్లు తక్షణ రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఆర్థికంగా మద్దుతు అందించడం ద్వారా ఆక్వాకల్చర్‌ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సమావేశంలో బ్యాంకర్లు, ఆక్వానెస్ట్‌ ఎన్‌జీవో ప్రతినిధులు, వ్యవసాయ భీమా సంస్థ అధికారులు, ఎల్‌డీఎం, డీడీఎం, నాబార్డు అధికారులు, మత్య్సశాఖ అధికారులు, ఆక్వా రైతులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 11:31 PM