మద్యం పట్టివేత
ABN , Publish Date - Aug 12 , 2026 | 11:02 PM
తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడులో దర్శి ఎకై్ౖసజ్ సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం దాడులు నిర్వహించారు.
కేసు నమోదు.. పరారీలో రెస్టారెంట్ యజమాని
తాళ్లూరు, ఆగస్టు11 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని బొద్దికూరపాడులో దర్శి ఎకై్ౖసజ్ సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం దాడులు నిర్వహించారు. అందిన సమాచారం మేరకు... గ్రామంలోని ఒక రెస్టారెంట్‌లో సోదాలు చేయగా 90 క్వార్టర్ బాటిళ్ల వైన్, 24 బాటిళ్ల బీరు సీసాలు అక్రమంగా అమ్మేందుకు ఉంచగా పట్టుకున్నారు. రెస్టారెంట్ యజమాని పరారీలో ఉన్నాడు. వీఆర్‌వో చిన్నికృష్ణయ్య సమక్షంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.